ETV Bharat / sports

IRE VS IND 2023 : టీమ్​ఇండియా-ఐర్లాండ్​ హెడ్​ టు హెడ్ రికార్డ్స్​.. ఆ ముగ్గురికి సవాల్​! - deepak hooda vs ireland

IRE VS IND 2023 : మరో రెండు రోజుల్లో(ఆగస్ట్ 18) ఐర్లాండ్‌తో మూడు టీ20ల సిరీస్‌ ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా ఇరు జట్ల హెడ్​ టు హెడ్ రికార్డ్స్​ చూద్దాం..

IRE VS IND 2023 : టీమ్​ఇండియా-ఐర్లాండ్​ హెడ్​ టు హెడ్ రికార్డ్స్​.. ఆ ముగ్గురికి సవాల్​!

author img

By

Published : Aug 16, 2023, 8:49 PM IST

IRE VS IND 2023 : మరో రెండు రోజుల్లో(ఆగస్ట్ 18) ఐర్లాండ్‌తో మూడు టీ20ల సిరీస్‌ షురూ అవ్వనుంది. ఆసియా కప్‌, వన్డే ప్రపంచకప్‌ వంటి మెగా టోర్నీల ముందు.. ఈ పొట్టి ఫార్మాట్​ను టీమ్​ఇండియా తన ప్రయోగాలకు వినియోగించనుంది. ఈ సిరీస్​ ద్వారా కొందరి ప్లేయర్ల ఫిట్‌నెస్‌ను కూడా పరీక్షించనుంది. దాదాపు ఏడాది తర్వాత గ్రౌండ్​లోకి అడగపెట్టనున్న బుమ్రాకు ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కు కెప్టెన్​గా వ్యవహరించనున్నాడు. అతడి ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవడానికి ఇది సరైన వేదిక. నాలుగు ఓవర్ల కోటా అయినా.. బౌలింగ్‌లో రిథమ్‌ను అందుకొనేందుకు ఇది బాగా ఉపయోగపడుతుంది.

మరో పేసర్ ప్రసిధ్ కృష్ణ కూడా ఈ సిరీస్​లో సత్తా చాటితే.. ఆసియా కప్‌ సహా వన్డే ప్రపంచకప్‌ జట్టులోకి ఎంట్రీ ఇచ్చేందుకు ఛాన్స్​లు ఉంటాయి. ఇక వెస్టిండీస్ పర్యటనలో ఆకట్టుకోలేకపోయిన సంజూ శాంసన్‌కు కూడా ఈ సిరీస్​లో బాగా రాణిస్తే.. భవిష్యత్త్​ చోటు ఉపయోగం ఉంటుంది.

తక్కువ అంచనా వేయలేం.. 2018 నుంచి టీమ్‌ఇండియాకు ఐర్లాంట్​తో ఇది మూడో పర్యటన. మొదటిసారి 2018లో కోహ్లీ నాయకత్వంలో రెండు టీ20ల్లో ఆడి భారత జట్టే విజయం సాధించింది. ఆ తర్వాత 2022లో(ireland vs india 2022 highlights) హార్దిక్‌ పాండ్య కెప్టెన్సీలో రెండు టీ20ల బరిలోకి దిగింది. ఈ సిరీస్​లోనూ గెలిచింది. ఇప్పుడు బుమ్రా కెప్టెన్సీలో బరిలోకి దిగనుంది. అసలు మొట్టమొదటిసారి 2009 టీ20 వరల్డ్​కప్​లో ఇరు జట్లు తలపడ్డాయి. అక్కడ కూడా భారత్‌దే విజయం. అయితే, ఐర్లాండ్‌ ఓడిపోయినంత మాత్రాన తక్కవ అంచనా వేయలేం. ఎందుకంటే టీ20ల్లో టీమ్​ఇండియాపైనే 221/5 భారీ స్కోరు ఆ జట్టు సాధించింది.

మరికొన్ని విశేషాలు..

కుల్‌దీప్‌ బౌలింగ్​తో.. మొదటి సారి 2018లో ఐర్లాండ్​తో సిరీస్​ ఆడినప్పుడు రోహిత్ శర్మ (97), శిఖర్ ధావన్‌ (74) రెచ్చిపోయి ఆడారు. వీరిద్దరి దెబ్బకు ఈ మొదటి మ్యాచ్‌లో భారత్​ 208/5 భారీ స్కోరే చేసింది. ఆ తర్వాత భారత బౌలర్లు.. ఐర్లాండ్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేశారు. 132/9 స్కోరుకే ఔట్​ చేశారు. బౌలర్లలో అద్భుతంగా రాణించిన కుల్‌దీప్ యాదవ్ (4/21).. ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డును ఎగరేసుకుపోయాడు. చాహల్ (3/38), బుమ్రా (2/19) వికెట్లు తీశారు.

భారీ తేడాతో భారత్​దే.. ఇక ఇదే సిరీస్‌లో రెండో టీ20 మ్యాచ్​లోనూ 200+ స్కోరు చేసింది టీమ్​ఇండియా. కేఎల్ రాహుల్ (70), సురేశ్‌ రైనా (69) అర్ధశతకాలు చేశారు. టీమ్ఇండియా 213/4 స్కోరు చేసింది. ఆ తర్వాత కుల్‌దీప్‌ యాదవ్ (3/16), చాహల్ (3/21) దెబ్బకు ఐర్లాండ్​ 70 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్​ 143 పరుగుల భారీ తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్​లో 'ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌'గా కేఎల్ రాహుల్, 'ప్లేయర్ ఆఫ్‌ ది సిరీస్‌'గా చాహల్‌ నిలిచారు.

12 ఓవర్ల మ్యాచ్​ మళ్లీ భారత్​దే.. హార్దిక్‌ పాండ్య కెప్టెన్సీలో 2022లో(ireland vs india 2022 highlights) రెండు టీ20లు ఆడింది టీమ్​ఇండియా. మొదటి మ్యాచ్‌ వర్షం కారణంగా 12 ఓవర్లే జరిగింది. చాహల్​(1/11) కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశాడు. 'ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌'ను అందుకున్నాడు. దీంతో మొదట ఐర్లాండ్‌ 108/4 స్కోరే చేసింది. ఆ తర్వాత ఛేదనలో దీపక్‌ హుడా (47*) అజేయ పరుగులు చేశాడు. ఇషాన్ కిషన్ 26 , హార్దిక్‌ 24 రాణించారు. దీంతో 9.2 ఓవర్లలోనే 111/3 స్కోరు చేసిన టీమ్ఇండియా గెలుపును ఖాతాలో వేసుకుంది.

దీపక్ హుడా శతకం.. ఇక ఈ ఇదే సిరీస్​లో రెండో మ్యాచ్‌లో మాత్రం ఐర్లాండ్‌ రెచ్చిపోయింది. మొదట బ్యాటింగ్‌ చేసిన టీమ్​ఇండియా 225/7 పరుగులు చేసింది. దీపక్ హుడా (104) శతకంతో మెరిశాడు(deepak hooda vs ireland). సంజూ శాంసన్‌ (77) అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. అయితే ఐర్లాండ్‌ కూడా దూకుడు ప్రదర్శించింది. కెప్టెన్ ఆండ్రూ బల్బిర్నీ (60) మంచిగా రాణించి టాప్​ స్కోరర్​గా నిలిచాడు. పాల్‌ స్టిర్లింగ్‌ (40), టారీ టెక్టర్ (39), జార్జ్‌ డాక్రెల్ (34*) కూడా పర్వాలేదనిపించారు. మార్క్‌ ఐదెర్ (23*) అజేయంగా నిలిచాడు. దీంతో వారే గెలుస్తారనుకున్నారు. కానీ చివరికి టీమ్​ఇండియా 4 పరుగులు తేడాతో గెలిచింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్​ అవార్డును దీపక్ హుడా అందుకున్నాడు.

ICC Latest T20 Rankings : ర్యాంకింగ్​లోకి దూసుకొచ్చిన జైస్వాల్​​.. కెరీర్​ బెస్ట్​లో గిల్​..

వరల్డ్ కప్ హీరో రిటైర్మెంట్ వెనక్కి.. ఇంగ్లాండ్ వన్డే జట్టుకు ఎంపికైన బెన్ స్టోక్స్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.