ETV Bharat / sports

సెంచరీ తర్వాత భార్యతో కోహ్లి వీడియో కాల్​.. ఐపీఎల్​లో రికార్డుల మోత - ipl 2023 rcb vs srh

Virat Kohli Video Call : సన్​రైజర్స్​తో జరిగిన మ్యాచ్​లో సెంచరీ చేసిన అనంతరం ఆర్స్​సీబీ బ్యాటర్​ విరాట్​ కోహ్లి.. తన భార్య అనుష్కతో వీడియో కాల్ మాట్లాడట. విరాట్.. అనుష్కతో వీడియో కాల్ మాట్లాడుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అలాగే సన్​రైజర్స్ హైదరాబాద్​ మ్యాచ్​లో విరాట్ సెంచరీ చేయడం వల్ల అతడు సాధించిన రికార్డులేంటో ఓ సారి తెలుసుకుందాం.

virat kohli ipl 2023
virat kohli ipl 2023
author img

By

Published : May 19, 2023, 9:55 AM IST

Virat Kohli Video Call : ఫార్మాట్ ఏదైనా విరాట్ కోహ్లి ఆటే వేరు. తన దూకుడుతో బ్యాటింగ్ చేసి క్రికెట్ అభిమానులను అబ్బురపరుస్తుంటాడు. ఈ క్రమంలో సన్​రైజర్స్​తో గురువారం ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్​లో కింగ్ కోహ్లి సెంచరీతో కదం తొక్కాడు. శతకం కొట్టిన అనంతరం విరాట్​.. తన భార్య అనుష్క శర్మతో వీడియో కాల్​లో మాట్లాడినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విరాట్ తన భార్యతో వీడియో కాల్ మాట్లాడుతున్నట్లు ఉన్న ఫొటోలను నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. మరోవైపు విరాట్ భార్య అనుష్క.. ఇన్​స్టాగ్రామ్ స్టేటస్​లో అతనొక బాంబు.. వాట్​ ఏ ఇన్సింగ్ అని స్టేటస్ పెట్టింది.

virat kohli ipl 2023
అనుష్క శర్మ ఇన్​స్టాగ్రామ్ స్టేటస్

సన్​రైజర్స్​తో విజయం అనంతరం విరాట్ కోహ్లీ అసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బయట ఎవరు ఏం మాట్లాడినా తాను పట్టించుకోనని.. ఎందుకంటే అది వారి వ్యక్తిగత అభిప్రాయం అని అన్నాడు. నేను గత గణాంకాలు గురించి ఆలోచించనని తెలిపాడు. మీరు, డుప్లెసిస్ అద్భుతంగా రాణించడంలో రహస్యం ఏంటని అడిగిన ప్రశ్నకు కోహ్లీ.. 'టాటూలు అనుకుంటున్నాను' అని చమత్కారంగా సమాధానమిచ్చాడు. తాను.. ఏబీ డివిలియర్స్​తో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఎలా ఉందో.. డుప్లెసిస్​తో కలిసి ఆడినప్పుడు అలానే ఉందన్నాడు కింగ్ కోహ్లీ.

'నేను ఇప్పటికే చాలా ఒత్తిడికి లోనయ్యాను. కొన్ని మంచి ఇన్సింగ్​లు ఆడినప్పటికీ కొన్నిసార్లు నాకు తగినంత క్రెడిట్ ఇచ్చుకోను. కాబట్టి బయట ఎవరు ఏం మాట్లాడినా నేను పట్టించుకోను. ఎందుకంటే అది వారి అభిప్రాయం. నేను పరిస్థితికి అనుగుణంగా బ్యాటింగ్ చేస్తా. మ్యాచ్​ను ఎలా గెలిపించాలో నాకు తెలుసు. నేను ఫ్యాన్సీ షాట్లు ఆడే బ్యాటర్​ని కాను. అందుకే టెక్నిక్ షాట్లు ఆడా. ఫ్యాన్సీ షాట్లు ఆడి నా వికెట్ పొగొట్టుకోలేను. అలాగే ఐపీఎల్ తర్వాత టెస్ట్​లు ఆడాల్సి ఉంది. నా టెక్నిక్​ను నేను ఎప్పటికి వదులుకోను. సన్​రైజర్స్ హైదరాబాద్ మంచి స్కోరు చేసి భారీ టార్గెట్​ను మా ముందు ఉంచింది. భారీ లక్ష్యాన్ని ఛేదించాం. ఆర్స్​బీకి హోమ్ గ్రౌండ్​ కాకపోయినా ప్రేక్షకుల భారీ ఎత్తున మద్దతు లభించింది. నేను డుప్లెసిస్​తో చెప్పా ఇది హైదరాబాద్​ అయినా బెంగళూరు టీమ్​కు హోమ్ గ్రౌండ్​లానే ఉందని.' అని ప్లేయర్ మ్యాచ్ అవార్డు అందుకున్న సందర్భంగా వ్యాఖ్యానించాడు.

virat kohli ipl 2023
అనుష్కతో విరాట్ వీడియో కాల్ మాట్లాడుతున్నట్లు నెటిజన్ పోస్ట్ చేసిన ఫొటో ​

Rcb vs Srh 2023 :సన్​రైజర్స్ హైదరాబాద్​తో జరిగిన మ్యాచ్​లో రాయల్ ఛాలెంజర్స్​ బెంగళూరు జట్టు ఘన విజయం సాధించింది. హైదరాబాద్ జట్టు నిర్దేశించిన 187 పరుగుల లక్ష్యాన్ని కేవలం రెండు వికెట్లు కోల్పోయి 19.2 ఓవర్లలో ఛేదించింది. ఆర్సీబీ ఓపెనర్లు విరాట్ కోహ్లి, డుప్లెసిస్ అదరగొట్టారు. విరాట్ 63 బంతుల్లో 100 రన్స్ చేయగా.. డుప్లెసిస్ 47 బంతుల్లో 71 పరుగుల చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

  • Virat Kohli Century In IPL : సన్​రైజర్స్​తో గురువారం జరిగిన మ్యాచ్​లో ఆర్సీబీ బ్యాటర్ విరాట్ కోహ్లి అరుదైన రికార్డును సాధించాడు. ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీల రికార్డు క్రిస్‌ గేల్‌ పేరిట ఉంది. గేల్‌ ఐపీఎల్‌లో ఇప్పటి వరకు ఆరు సెంచరీలు బాదాడు. తాజాగా సన్​రైజర్స్​తో మ్యాచ్‌లో కోహ్లి ఐపీఎల్‌లో ఆరో సెంచరీ సాధించి గేల్‌ రికార్డును సమం చేశాడు. కోహ్లి, గేల్‌ తర్వాత జాస్‌ బట్లర్‌ ఐదు శతకాలతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక కోహ్లి మరొక సెంచరీ సాధిస్తే ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు బాదిన క్రికెటర్‌గా నిలుస్తాడు.
  • ఆర్సీబీ బ్యాటర్​ విరాట్​ కోహ్లి ఐపీఎల్‌ 16వ సీజన్‌లో 500 పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. ఐపీఎల్‌ చరిత్రలో కోహ్లి 500 ప్లస్‌ స్కోర్లు చేయడం ఇది ఆరోసారి. టీమ్​ఇండియా తరఫున ఈ ఘనత సాధించిన తొలి బ్యాటర్‌గా కోహ్లి రికార్డులకెక్కాడు.
  • ఆర్‌సీబీ తరపున కింగ్ కోహ్లి ఇప్పటివరకు 7,500 పరుగులు పూర్తి చేశాడు. ఐపీఎల్‌, ఛాంపియన్స్‌ లీగ్‌ కలిపి కోహ్లి ఈ మార్క్​ సాధించాడు. ఆర్‌సీబీ తరపున ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్‌గా కోహ్లీ నిలిచాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.