ETV Bharat / sports

virat kohli records: కోహ్లీ నయా రికార్డు.. ఒకే ఒక్కడిగా ఘనత! - కోల్​కతా బెంగళూరు టాస్

ఐపీఎల్​లో మరో రికార్డు సాధించాడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సారథి విరాట్ కోహ్లీ(virat kohli rcb news). ఆర్సీబీ తరఫున 200 మ్యాచ్​లు(virat kohli records) ఆడిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు. లీగ్​లో మరే ఆటగాడు కూడా ఇప్పటివరకు ఓ ఫ్రాంచైజీ తరఫున ఇన్ని మ్యాచ్​లు ఆడలేదు.

Virat Kohli
కోహ్లీ
author img

By

Published : Sep 20, 2021, 7:57 PM IST

నేడు (సెప్టెంబర్ 20) అబుదాబి వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌(rcb vs kkr 2021) జరుగుతోన్న మ్యాచ్‌ ద్వారా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సారథి విరాట్‌ కోహ్లీ(virat kohli records) ఓ రికార్డు సాధించాడు. ఐపీఎల్‌లో ఒకే ఫ్రాంచైజీ తరఫున 200 మ్యాచ్‌లు ఆటగాడిగా గుర్తింపు పొందాడు. ఐపీఎల్‌లో ఇప్పటివరకు ఏ ఆటగాడు కూడా ఒకే ఫ్రాంచైజీకి 200 మ్యాచ్‌లు ఆడలేదు. అయితే, ఓవరాల్‌గా చూసుకుంటే ఆర్సీబీ(virat kohli rcb news) తరఫున విరాట్‌కి ఇది 215 మ్యాచ్‌. ఛాంపియన్స్‌ లీగ్‌ టీ20లో ఆర్‌సీబీ తరఫున 15 మ్యాచ్‌లు ఆడాడు. కేవలం ఐపీఎల్​ పరంగా చూసుకుంటే ఓ ఫ్రాంచైజీ తరఫున ఎక్కువ మ్యాచ్​లు ఆడిన వారిలో కోహ్లీ (200) తర్వాత ధోనీ (182, చెన్నై), రైనా (172, చెన్నై), పొలార్డ్ (172, ముంబయి), రోహిత్ శర్మ (162, ముంబయి) ఉన్నారు.

ఈ ఐపీఎల్ సీజన్‌ తర్వాత రాయల్‌ ఛాలెంజర్స్‌ జట్టు కెప్టెన్‌గా తప్పుకుంటానని విరాట్ కోహ్లీ(virat kohli captaincy news) ప్రకటించాడు. అయితే, ఐపీఎల్ ఆడినంత కాలం ఆర్సీబీ(virat kohli rcb news)కే ప్రాతినిధ్యం వహిస్తానని స్పష్టం చేశాడు. ఆటగాడిగా విజయవంతమైన కోహ్లీ(virat kohli news).. కెప్టెన్‌గా ఆర్సీబీని ఇంతవరకు ఛాంపియన్‌గా నిలపలేకపోయాడు. అతడి కెప్టెన్సీలో 2016లో ఫైనల్‌ చేరడమే బెంగళూరుకు అత్యుత్తమ ప్రదర్శన. ఈ సారి అయినా ఆర్సీబీని విజేతగా నిలుపుతాడో లేదో చూడాలి.

ఐపీఎల్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లు

ఆటగాడుమ్యాచ్‌లు ప్రస్తుతం ఆడుతున్న జట్టు
ఎం.ఎస్‌.ధోనీ 212 చెన్నై సూపర్‌ కింగ్స్‌
రోహిత్ శర్మ 207ముంబయి ఇండియన్స్‌
దినేశ్‌ కార్తీక్‌ 204 కోల్‌కతా నైట్‌రైడర్స్‌
సురేశ్‌ రైనా 201 చెన్నై సూపర్‌ కింగ్స్‌
విరాట్‌ కోహ్లీ 200 రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు

ఇవీ చూడండి: రెండు దేశాల తరఫున ఆడిన క్రికెటర్లు వీరే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.