ETV Bharat / sports

ఒక బాల్​ కోసం ఇద్దరి పరుగు.. కోహ్లీ మిస్​ చేశాడుగా!

గురువారం ఆర్సీబీ పంజాబ్​ మధ్య జరిగిన మ్యాచ్​లో కింగ్ కోహ్లీతో పాటు తన టీమ్ మేట్​ చేసిన ఓ పనితో స్టేడియంలో ఉన్న ఫ్యాన్స్​ ఒక్కసారిగా షాకయ్యారు. ఇంతకీ వీరిద్దరు ఏం చేశారంటే..

virat kohli and suyyash catch
virat kohli and suyyash catch
author img

By

Published : Apr 21, 2023, 8:15 AM IST

Updated : Apr 21, 2023, 10:34 AM IST

ఆర్సీబీ స్టార్​ ప్లేయర్​ విరాట్​ కోహ్లీ తన ఆటతీరుతో అందరినీ ఆకట్టుకుంటాడు. ఎల్లప్పుడూ యాక్టివ్​గా ఉంటూ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతుంటాడు. ముఖ్యంగా ఇతను క్యాచ్‌లు పట్టే స్టైల్​కు ఫ్యాన్స్​ ఫిదా అవుతుంటారు. అయితే సాధారణంగా కోహ్లీ క్యాచ్‌లు వదిలేయడం అనేది చాలా అరుదు. క్లిష్ట పరిస్థితుల్లో లేదా తీవ్ర ఒత్తిడిలో తప్ప మిగతా అన్ని సందర్భాల్లోనూ తన క్యాచింగ్​ స్కిల్స్​తో అదరగొడుతుంటాడు. అలాంటి కింగ్​ కోహ్లీ మొదటిసారి ఓ క్యాచ్‌ పట్టే విషయంలో సందిగ్ధతకు లోనయ్యాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..

గురువారం పంజాబ్‌ కింగ్స్​తో ఆర్సీబీ మ్యాచ్​లో ఈ ఘటన జరిగింది. పంజాబ్​ ఇన్నింగ్స్‌లో ఆ టీమ్​కు చెందిన జితేశ్‌ శర్మ రంగంలోకి దిగాడు. సరిగ్గా 17వ ఓవర్లో అతను ఓ భారీ షాట్‌ ఆడాడు. దీంతో ఆ బాల్​ను క్యాచ్​ చేసేందుకు డీప్‌ మిడ్‌ వికెట్‌లో ఉన్న సుయాశ్‌ ప్రభు దేశాయ్‌ పరుగులు తీశాడు. ఇంతలో లాంగాన్‌లో ఉన్న కోహ్లీ కూడా క్యాచ్​ పట్టేందుకు ముందుకొచ్చాడు. ఇక సుయాశ్‌ను గమనించిన కోహ్లీ.. నువ్వు ఆగిపో నేను పట్టుకుంటాలే.. అన్నట్టుగా సైగ చేశాడు.

కోహ్లీ సైగను అర్థం చేసుకున్న సుయాశ్‌ కొద్దిగా స్లో అయ్యాడు. అయితే పట్టుకుందామని వచ్చి కోహ్లీ మాత్రం క్యాచ్​ అందుకోవడంలో విఫలమయ్యాడు. చేతిలో పడినట్లే పడి ఆ బంతి పట్టుతప్పి కిందపడిపోయింది. ఇక క్యాచ్‌ పోయింది అని నిరాశగా చూస్తున్న సుయాశ్​ను చూసి కోహ్లీ నవ్వుతూ మిస్‌ అయింది అని చెప్పాడు.

పంజాబ్​ మ్యాచ్​లో కోహ్లీ రికార్డుల మోత..
గురువారం పంజాబ్ కింగ్స్​తో జరిగిన మ్యాచ్​లో ఆర్సీబీ జట్టు ఓపెనర్​గా దిగిన విరాట్ కోహ్లీ.. ఈ మ్యాచ్​లో పలు రికార్డులను తన ఖాతాలోకి వేసుకున్నాడు. రెగ్యులర్ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ పక్కటెముక గాయంతో బాధపడుతూ ఫీల్డింగ్ చేయకపోవడం వల్ల ఆర్సీబీ స్టాండింగ్ కెప్టెన్​గా బాధ్యతలు తీసుకున్నకోహ్లీ.. అన్నీ తానై జట్టును చూసుకున్నాడు.

ఈ మ్యాచ్​లో 59 పరుగులను స్కోర్​ చేసిన ఈ స్టార్​ బ్యాటర్... 24 పరుగుల తేడాతో ఆర్సీబీ విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. 47 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్స్​తో స్టేడియాన్ని దద్దరిల్లేలా చేశాడు. ఈ క్రమంలో కోహ్లీ పలు రికార్డులను సాధించాడు. ఐపీఎల్​లో ఉన్న కెప్టెన్లు అందరిలో 6500 పరుగులు స్కోర్​ చేసిన మొట్టమొదటి ఆటగాడిగా చరిత్రకెక్కాడు. అంతే కాకుండా ఐపీఎల్​లో 600 ఫోర్లు కొట్టిన మూడో బ్యాట్స్ మన్ విరాట్. ఈ లిస్ట్​లో 730 ఫోర్లతో శిఖర్ ధావన్ మొదటి స్థానంలో ఉండగా..608 ఫోర్లతో దిల్లీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.

Last Updated : Apr 21, 2023, 10:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.