ETV Bharat / sports

ముగిసిన కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్.. రికార్డులివే! - ఐపీఎల్ 2021

ఐపీఎల్ 2021(IPL 2021 News)లో భాగంగా ఎలిమినేటర్ మ్యాచ్​లో కోల్​కతా నైట్​రైడర్స్ చేతిలో ఓటమిపాలై ఇంటిముఖం పట్టింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(kkr vs rcb 2021). దీంతో ఒక్కసారి కూడా టైటిల్ గెలవకుండానే తన ఐపీఎల్ కెప్టెన్సీ(virat kohli captaincy in ipl) ఇన్నింగ్స్​ను ముగించాడు విరాట్. ఈ నేపథ్యంలో అతడి సారథ్యంలో నెలకొల్పిన రికార్డులేంటో చూద్దాం.

Virat Kohli
కోహ్లీ
author img

By

Published : Oct 12, 2021, 10:14 AM IST

ఐపీఎల్ 2021(IPL 2021 News)లో భాగంగా కోల్​కతా నైట్​రైడర్స్(kkr vs rcb 2021)​తో జరిగిన మ్యాచ్​లో ఓటమిపాలైంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఫలితంగా ఆర్సీబీ కెప్టెన్(virat kohli captaincy in ipl)​గా విరాట్ కోహ్లీ ప్రయాణం ముగిసింది. గత 10 ఏళ్లుగా ఆ జట్టుకు సారథ్యం వహిస్తున్న విరాట్​.. జట్టుకు ట్రోఫీ మాత్రం అందించలేకపోవడం అభిమానులను తీవ్రంగా కలిచివేస్తోంది. ఐపీఎల్(ipl news) ప్రారంభమైన 2008 నుంచి ఆర్సీబీకే ఆడుతున్న ఇతడు.. 2011లో వెటోరీ నుంచి కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్నాడు. అప్పటి నుంచి ఈ ఫ్రాంచైజీతోనే ఉన్న కోహ్లీ.. ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు. ఆర్సీబీ ఫ్యాన్ ఫాలోయింగ్​ను పెంచాడు. ఈ నేపథ్యంలో కోహ్లీ కెప్టెన్​గా సాధించిన రికార్డులపై ఓ లుక్కేద్దాం.

  • ఐపీఎల్ కెప్టెన్​గా అత్యధిక పరుగులు సాధించిన జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు కోహ్లీ. ఇతడి ఖాతాలో 4881 రన్స్ ఉన్నాయి.
  • ఓ ఐపీఎల్ సీజన్​లో అత్యధిక పరుగులు (973) చేసిన కెప్టెన్​గానూ కోహ్లీకి రికార్డుంది.
  • లీగ్​లో కెప్టెన్​గా 5 సెంచరీలు బాదాడు కోహ్లీ. ఇది కూడా రికార్డే.
  • కెప్టెన్​గా అర్ధసెంచరీల రికార్డూ విరాట్ పేరిటే ఉంది. లీగ్​లో సారథిగా ఉండి 40 అర్ధసెంచరీలు చేశాడు.
  • ఐపీఎల్‌లో 140 మ్యాచ్‌లకు సారథిగా వ్యవహరించాడు కోహ్లీ. ఇందులో 66 విజయాలు, 70 అపజయాలు ఉన్నాయి. నాలుగు మ్యాచ్‌ల ఫలితాలు తేలలేదు.
  • కోహ్లీ సారథ్యంలో 2016లో ఆర్సీబీ ఫైనల్‌కు చేరింది.
  • 2017, 2019 సీజన్లలో చివరిస్థానంలో నిలిచింది.
  • ఐపీఎల్​లో ఎక్కువ మ్యాచ్​లకు కెప్టెన్​గా చేసి ట్రోఫీ గెలవని ఆటగాడిగానూ కోహ్లీ చెత్త రికార్డు నెలకొల్పాడు. కెప్టెన్​గా 140 మ్యాచ్​లకు సారథ్యం వహించిన ఇతడు టైటిల్ గెలవలేకపోయాడు. కోహ్లీ తర్వాత వీరేంద్ర సెహ్వాగ్ (53), సచిన్ (51) ఉన్నారు.

ఇవీ చూడండి: కోహ్లీ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ముగిసిందిలా..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.