ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో 2022 నుంచి 10 జట్లు ఆడనున్నాయి. ఈ మేరకు మరో రెండు జట్ల కోసం మే నెలలో.. వేలం నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జై షా సహా.. ఉన్నతాధికారులు శనివారం సమావేశం నిర్వహించారు.
ఈ ఏడాది ప్రారంభంలో.. ఐపీఎల్ పాలక మండలి ఆమోదించిన పలు నిర్ణయాల అమలుపై చర్చించారు. ఈ సమావేశంలోనే.. కొత్త ఫ్రాంఛైైజీలు, బిడ్డింగ్ ప్రక్రియ వంటివాటిపై నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. జట్లపై తుది నిర్ణయం రాగానే.. ఆయా జట్లు తదుపరి ప్రక్రియను ప్రారంభించుకోవచ్చని బీసీసీఐ అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి: 'అందుకే ధోనీని సారథిగా కొనసాగిస్తున్నాం'