ప్రస్తుత భారతదేశంలో నెలకొన్న పరిస్థితులతో పోలిస్తే.. తాము స్వదేశానికి ఎలా వెళ్లాలనేది చిన్న సమస్య అని దిల్లీ క్యాపిటల్స్ ప్రధాన కోచ్ రికీ పాంటింగ్ వెల్లడించాడు. భారత్ నుంచి ఆస్ట్రేలియాకు విమాన రాకపోకలు నిషేధించడంపై ఇతర ఆసీస్ క్రికెటర్లు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. కానీ, రికీ మాత్రం అందుకు సానుకూలంగా స్పందించాడు.
"ప్రస్తుతం ఐపీఎల్లో భాగంగా కొంతమంది ఆసీస్ ఆటగాళ్లతో పాటు సహాయక సిబ్బంది భారత్‌లో ఉండిపోయాం. మేము స్వదేశానికి ఎలా వెళ్లాలనేది ఇబ్బందే. కానీ, ఇక్కడ బయట ఉన్న కొవిడ్ పరిస్థితులతో పోలిస్తే మాది చిన్న సమస్య."
-రికీ పాంటింగ్, దిల్లీ క్యాపిటల్స్ ప్రధాన కోచ్.
ఇదీ చదవండి: ఐఓఏ ఉపాధ్యక్షుడు జనార్ధన్ సింగ్ కన్నుమూత
"బయట పరిస్థితి ఎలా ఉందనేది ప్రతిరోజు స్థానిక ఆటగాళ్లను అడిగి తెలుసుకుంటున్నా. ఐపీఎల్ వల్ల మేము సురక్షిత బబుల్‌లో ఉన్నాం. ఈ కఠిన పరిస్థితుల్లో కనీసం ఐపీఎల్ చూడడం ద్వారా అభిమానులు ఎంతో కొంత వినోదాన్ని పొందుతున్నారని భావిస్తున్నాను" అని పాంటింగ్ తెలిపాడు.
"కొవిడ్ కారణంగా ఐపీఎల్ నుంచి స్థానిక ఆటగాడు అశ్విన్ లీగ్‌కు కాస్త విరామమిచ్చాడు. ఇది ముందుగా మా జట్టులోనే జరిగింది. దీంతో ప్రతిరోజు చర్చ జరుగుతూనే ఉంది" అని దిల్లీ కోచ్ పేర్కొన్నాడు.
ఇదీ చదవండి: 'వారికి సమాచారం మాత్రమే కావాలి.. ప్రయోజనాలు కాదు'