ETV Bharat / sports

ఈ ఓటమికి బాధ్యత నాదే: వార్నర్​ - warner blames

చెన్నై జట్టుతో జరిగిన మ్యాచ్​లో ఓటమికి తనదే పూర్తి బాధ్యత అని హైదరాబాద్​ కెప్టెన్ వార్నర్ చెప్పాడు​. తాను నెమ్మదిగా ఎందుకు ఆడాల్సి వచ్చిందో వివరించాడు.

Warner
వార్నర్​
author img

By

Published : Apr 29, 2021, 10:07 AM IST

చెన్నై సూపర్​కింగ్స్​తో బుధవారం జరిగిన మ్యాచ్​లో తమ జట్టు ఓటమికి తాను పూర్తి బాధ్యత వహిస్తున్నట్లు సన్​రైజర్స్​ హైదరాబాద్​ సారథి వార్నర్ తెలిపాడు​. ఈ మ్యాచ్​లో సీఎస్కే 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

"ఈ ఓటమికి నాదే పూర్తి బాధ్యత. నేనే నెమ్మదిగా బ్యాటింగ్ చేశా. మనీశ్​ పాండే చాలా బాగా బ్యాటింగ్​ చేశాడు. కేన్​ విలియమ్సన్​, కేదార్​ జాదవ్​ గౌరవప్రదమైన స్కోరును అందించారు. నేను బాదిన 15షాట్లు నేరుగా ఫీల్డర్ల్​ చేతుల్లోకి వెళ్లడం వల్ల.. సింగిల్స్​తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మొత్తంగా మ్యాచ్​ ఓటమికి బాధ్యత తీసుకుంటున్నాను" అని వార్నర్ చెప్పాడు.

ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్​ చేసిన హైదరాబాద్​ 172 పరుగులు చేసింది. వార్నర్​(57; 55 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్​లు) చాలా నెమ్మదిగా ఆడాడు. మనీష్​ పాండే(61), విలియమ్సన్​(26) స్కోరు చేశారు. అనంతరం ధోనీసేన తొమ్మిది బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించి విజయాన్ని అందుకుంది.

ఇదీ చూడండి.. ఆగస్టులో కరేబియన్​ ప్రీమియర్​ లీగ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.