దినేశ్ కార్తిక్ ఇంజక్షన్ తీసుకుని ఐపీఎల్ ప్లేఆఫ్స్‌లో పాల్గొన్నాడని(dinesh karthik news) తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ ఎస్ రామస్వామి చెప్పాడు. కార్తిక్ మోకాలి గాయంతో బాధపడుతున్నందున వచ్చే నెలలో ప్రారంభమయ్యే సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీకి ఆడలేడని అనుకున్నట్లు తెలిపారు.
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ నవంబర్ 4న ప్రారంభం కానుంది. తమిళనాడు జట్టుకు కార్తిక్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. లీగ్ ఫైనల్ నవంబర్ 24న జరుగుతుంది. అయితే.. మోకాలి గాయంతో దినేశ్ కార్తిక్ ఆడలేడని భావించి కెప్టెన్‌గా విజయ్ శంకర్ పేరును ప్రకటించినట్లు రామస్వామి తెలిపారు. ఐపీఎల్ ప్లేఆఫ్స్ సందర్భంగా కార్తిక్ ఇంజక్షన్ తీసుకుని మ్యాచ్ పూర్తి చేశాడని రామస్వామి చెప్పారు. దీంతో విజయ్ శంకర్ స్థానంలో కార్తిక్‌నే సారథిగా నియమించినట్లు వెల్లడించారు.
ఈ ఏడాది ఐపీఎల్లో కోల్‌కతా (ipl 2021 news) తరుపున ఆడిన దినేశ్ కార్తిక్ మోస్తరు ప్రదర్శన చేశాడు. 15 ఇన్నింగ్స్‌ల్లో 223 పరుగులు చేశాడు. 22.3 సగటుతో బ్యాటింగ్ చేశాడు. ఈ సీజన్లో కోల్‌కతా ఫైనల్ చేరింది. కానీ చెన్నై సూపర్‌కింగ్స్ చేతిలో ఓడి, రన్నరప్‌గా నిలిచింది.
ఇదీ చదవండి: T20 World Cup: భారత్-పాక్ పోరు.. టీమ్ఇండియాదే జోరు!