ETV Bharat / sports

కోల్​కతాతో మ్యాచ్​.. రోహిత్​ను ఊరిస్తున్న రికార్డులు! - రోహిత్ శర్మ ఐపీఎల్ 2021 సిక్సులు

ఐపీఎల్​(ipl 2021 live) రెండో విడతలో భాగంగా నేడు(సెప్టెంబర్ 23) ముంబయి ఇండియన్స్​తో పోటీపడనుంది కోల్​కతా నైట్​రైడర్స్(mi vs kkr 2021). ఈ మ్యాచ్​లో ముంబయి కెప్టెన్ రోహిత్​(rohit sharma news)ను పలు రికార్డులు ఊరిస్తున్నాయి. అవేంటో చూద్దాం.

Rohit Sharma
రోహిత్
author img

By

Published : Sep 23, 2021, 3:35 PM IST

ఐపీఎల్​ రెండో దశను ఓటమితో ప్రారంభించిన ముంబయి ఇండియన్స్​ నేడు (సెప్టెంబర్ 23) కోల్​కతా నైట్​రైడర్స్​(mi vs kkr 2021)తో జరిగే మ్యాచ్​లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది. అబుదాబి వేదికగా ఈ రెండు జట్లు పోటీపడనున్నాయి. చెన్నైతో జరిగిన మ్యాచ్​కు దూరమైన ముంబయి కెప్టెన్​ రోహిత్​ శర్మ(rohit sharma news).. ఈ మ్యాచ్​లో ఆడతాడని అభిమానులు భావిస్తున్నారు. ఒకవేళ ఈ మ్యాచ్​లో హిట్​మ్యాన్​ ఆడితే.. అతడికి పలు రికార్డులు సాధించే అవకాశం ఉంది. అవేంటో చూద్దాం.

  • కోల్​కతాతో జరిగే మ్యాచ్​లో రోహిత్(rohit sharma news) మరో 18 పరుగులు సాధిస్తే ఐపీఎల్​లో ఓ ప్రత్యర్థి జట్టుపై 1000 పరుగులు సాధించిన తొలి క్రికెటర్​లో చరిత్ర సృష్టిస్తాడు. ఇప్పటివరకు కోల్​కతాపై ఇతడు 982 పరుగులు చేశాడు. సన్​రైజర్స్ ఆటగాడు డేవిడ్ వార్నర్​ పంజాబ్ కింగ్స్​పై 943 పరుగులు సాధించి రెండో స్థానంలో ఉండగా, కోహ్లీ 909 (దిల్లీ క్యాపిటల్స్) పరుగులతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.
  • ఈ మ్యాచ్​లో రోహిత్(rohit sharma news) మరో 4 సిక్సులు(rohit sharma six ipl) సాధిస్తే టీ20ల్లో 400 సిక్సులు బాదిన తొలి భారత ఆటగాడిగా రికార్డు సృష్టిస్తాడు . ప్రస్తుతం 397 సిక్సులతో ఉన్నాడు.
  • ఈ మ్యాచ్​ పవర్​ప్లేలో మరో 2 సిక్సులు(rohit sharma six ipl) బాదితే ఐపీఎల్ పవర్​ప్లేలో 50 సిక్సులు సాధించిన తొలి ముంబయి ఇండియన్స్ బ్యాట్స్​మన్​గా రోహిత్ (rohit sharma news) రికార్డు నెలకొల్పుతాడు.
  • ఈ మ్యాచ్​లో 4 ఫోర్లు బాదితే కోల్​కతాపై 100 ఫోర్లు(rohit sharma ipl fours) కొట్టిన తొలి ఆటగాడిగా రోహిత్(rohit sharma news) రికార్డు కైవసం చేసుకుంటాడు.
  • ప్రస్తుతం 5,480 పరుగులతో ఐపీఎల్​లో అత్యధిక పరుగులు(rohit sharma ipl runs total) సాధించిన బ్యాట్స్​మెన్ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు రోహిత్ శర్మ(rohit sharma news). ఈ మ్యాచ్​లో 16 పరుగులు సాధిస్తే చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు సురేశ్​ రైనా (5,495)ను దాటి మూడో స్థానంలోకి వెళ్తాడు. కోహ్లీ (6081), ధావన్ (5619) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.

ఇవీ చూడండి: టీ20 ప్రపంచకప్​లో అఫ్గాన్​పై ఐసీసీ వేటు?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.