ETV Bharat / sports

ధోనీ జెర్సీలో సురేశ్​ రైనా నెట్​ ప్రాక్టీస్​ - చెన్నై సూపర్​కింగ్స్​ వార్తలు

ఈ ఏడాది ఐపీఎల్​ కోసం చెన్నై సూపర్​కింగ్స్​ వైస్​కెప్టెన్​ సురేశ్​రైనా సన్నద్ధమవుతున్నాడు. ధోనీ జెర్సీ ధరించి నెట్స్​లో బ్యాటింగ్​ చేస్తున్నాడు. దానికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్​గా మారాయి.

Suresh Raina spotted wearing CSK's 'Jersey No7' while practicing in the nets
ధోనీ జెర్సీలో సురేశ్​ రైనా నెట్​ ప్రాక్టీస్​
author img

By

Published : Feb 19, 2021, 1:35 PM IST

ఐపీఎల్​ 14వ సీజన్​ కోసం నెట్​ ప్రాక్టీస్​ మొదలెట్టేశాడు టీమ్ఇండియా మాజీ క్రికెటర్​ సురేశ్​ రైనా. చెన్నై సూపర్​కింగ్స్​ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న రైనా.. తన కెప్టెన్ ఎంఎస్​ ధోనీ జెర్సీని ధరించి ప్రాక్టీసు చేస్తుండటం విశేషం. దానికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్​గా మారాయి.

Suresh Raina spotted wearing CSK's 'Jersey No7' while practicing in the nets
నెట్స్​లో ప్రాక్టీస్​కు దిగిన రైనా

సీఎస్కేలో ధోనీ తర్వాత రెండో ప్రధాన ఆటగాడిగా కొనసాగుతోన్న సురేశ్ రైనా.. గతేడాది జట్టుతో పాటు యూఏఈ బయల్దేరినా, కుటుంబ కారణాల వల్ల సీజన్ ప్రారంభానికి ముందే స్వదేశానికి వచ్చాడు. ఆ తర్వాత జట్టు వెబ్​సైట్ నుంచి రైనా పేరును తొలగించింది ఫ్రాంచైజీ. దీంతో ఇతడితో కాంట్రాక్టును చెన్నై ముగించిందంటూ వార్తలు వచ్చాయి. కానీ అనూహ్యంగా రైనాను ఈ సీజన్​ కోసం అట్టిపెట్టుకున్నట్లు ప్రకటించింది యాజమాన్యం.

నెట్స్​లో ప్రాక్టీస్​ చేస్తోన్న రైనా

ఇదీ చూడండి: ఐపీఎల్2021: ఫ్రాంచైజీల షాకింగ్ రిటెన్షన్స్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.