ETV Bharat / sports

IPL 2021: సన్​రైజర్స్​ ఆటగాడికి కరోనా.. మ్యాచ్​ మాత్రం యథావిధిగా - సన్​రైజర్స్ హైదరాబాద్

sunrisers hyderabad
సన్ రైజర్స్ హైదరాబాద్
author img

By

Published : Sep 22, 2021, 3:07 PM IST

Updated : Sep 22, 2021, 5:15 PM IST

15:05 September 22

IPL 2021: సన్​రైజర్స్​ ఆటగాడికి కరోనా.. మ్యాచ్​ మాత్రం యథావిధిగా

natarajan
నటరాజన్

ఐపీఎల్​లో(IPL 2021) మరోసారి కరోనా కలకలం సృష్టిస్తోంది. సన్​రైజర్స్​ జట్టులోని ప్రధాన బౌలర్​ నటరాజన్​(Natarajan IPL) వైరస్ బారిన పడ్డాడు. ఆయనకు సన్నిహితంగా ఉన్న ఆరుగురు ప్రస్తుతం ఐసోలేషన్​కు ఉన్నారు. అయితే టీమ్​లోని ఇతర ఆటగాళ్లకు కొవిడ్​ నెగటివ్​గా తేలిన నేపథ్యంలో బుధవారం దిల్లీ క్యాపిటల్స్​, సన్​రైజర్స్​ హైదరాబాద్(SRH vs DC 2021)​ మధ్య మ్యాచ్​  యథావిధిగా జరగనుందని బీసీసీఐ పేర్కొంది.

ఆల్​రౌండర్ విజయ్ శంకర్, విజయ్ కుమార్(టీమ్ మేనేజర్), శ్యామ్ సుందర్ జే(ఫిజియోథెరపిస్ట్), అంజనా వన్నన్(డాక్టర్), తుషార్ ఖేడ్కర్(లాజిస్టిక్స్ మేనేజర్), పెరియసామి గణేశన్(నెట్ బౌలర్).. నటరాజన్​కు సన్నిహితంగా మెదిలినట్లు సన్​రైజర్స్ మెడికల్​ బృందం గుర్తించింది. ప్రస్తుతం వీరు ఐసోలేషన్​లో ఉన్నారు.

మరోవైపు.. ఐపీఎల్​ పాయింట్ల పట్టికలో దిల్లీ క్యాపిటల్స్​ రెండో స్థానంలో ఉండగా సన్​రైజర్స్​ అట్టడుగు స్థానంలో ఉంది.  

Last Updated : Sep 22, 2021, 5:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.