సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్.. ఇప్పుడు సీజన్ మొత్తానికే దూరమయ్యేలా కనిపిస్తున్నాడు. కెప్టెన్సీ నుంచి అతడిని తప్పిస్తున్నట్లు చెప్పిన తర్వాతి రోజే ఆ జట్టు కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సీజన్‌లోని తదుపరి మ్యాచ్‌ల్లో వార్నర్ ఆడకపోవచ్చని ట్రెవర్ బెయిలీస్ చెప్పాడు. రాజస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అతడిని పక్కనపెట్టారు. ఇప్పుడు అతడి ఆడటమే కష్టమని అంటున్నారు. దీంతో అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విదేశీ ఆటగాళ్లు నలుగురే ఉండే నిబంధనతో తాము బౌలింగ్ ఆప్షన్లను కూడా దృష్టిలో పెట్టుకునే రాజస్థాన్‌తో మ్యాచ్‌లో వార్నర్‌ను పక్కన పెట్టినట్లు ట్రెవర్ వెల్లడించాడు. ఇది కఠిన నిర్ణయమైనప్పటికీ జట్టు ప్రయోజనాల కోసం తప్పలేదన్నాడు. తాము ఆడబోయే మిగతా మ్యాచ్‌ల్లోనూ దాదాపుగా ఇదే వ్యూహాన్ని కొనసాగించవచ్చని చెప్పాడు.
రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కొత్త సారథి కేన్ విలియమ్సన్ నేతృత్వంలో బరిలో దిగినా సన్‌రైజర్స్‌కు ఓటమి తప్పలేదు. 55పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది.
ఇదీ చూడండి: వార్నర్‌ను కెప్టెన్సీ నుంచి అందుకే తప్పించారా?