టీ20 ప్రపంచకప్‌కు(T20 World cup) ముందు ప్రాక్టీస్ కావాలంటే ఐపీఎల్(IPL) ఆడడమే సరైన నిర్ణయమని ఆస్ట్రేలియా క్రికెటర్లకు ఆ జట్టు మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్(Ricky Ponting) సలహా ఇచ్చాడు. సెప్టెంబర్ 19న యూఏఈ వేదికగా ఐపీఎల్ రెండో దశ టోర్నీ ఆరంభం కానున్న నేపథ్యంలో అతడిలా వ్యాఖ్యానించాడు.
"ఐపీఎల్ తొలి దశ టోర్నీలో ఆడిన తర్వాత మూడు నాలుగు నెలల నుంచి క్రికెట్‌కు దూరంగా ఉన్న ఆస్ట్రేలియా ఆటగాళ్లు మళ్లీ మ్యాచ్ ప్రాక్టీస్ కావాలంటే కచ్చితంగా ఐపీఎల్ రెండో దశ టోర్నీలో ఆడాలి. ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ ఆటగాళ్లు ఈ లీగ్ బరిలో ఉంటారు. ఈ అనుభవం అక్టోబర్ 17న ఆరంభమయ్యే టీ20 ప్రపంచకప్‌కు ఎంతో ముఖ్యం. యూఏఈలో పరిస్థితులు టీ20 ప్రపంచకప్‌కు వేదికైన భారత్‌ను పోలి ఉంటాయి"
- రికీ పాంటింగ్, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్
గాయం కారణంగా ఆరోన్ ఫించ్ ఇప్పటికే ఐపీఎల్ రెండో దశ టోర్నీకి దూరమవ్వగా.. రిలీ మెరిడీత్, డాన్ క్రిస్టియన్, హెన్రిక్స్, మిచెల్ మార్ష్, ఆడమ్ జంపా, ఆండ్రూ టై, జోష్ ఫిలిప్, కౌల్టర్‌నీల్, క్రిస్ లిన్, బెన్ కటింగ్ ఐపీఎల్ జట్లలో ఉన్నారు. వీరిలో మార్ష్, ఫిలిప్ తొలి విడత ఐపీఎల్‌లో ఆడలేదు. బయో బుడగలో కరోనా కేసులు రావడం వల్ల ఈ మే 4న ఐపీఎల్-14ను నిరవధికంగా వాయిదా వేశారు. ఈ టోర్నీలో ఇంకా 76 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.
ఇదీ చూడండి.. 'ఆటలను ప్రేమిస్తేనే సరిపోదు.. ఆడాలి'