ETV Bharat / sports

IPL 2021 news: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆర్సీబీ - కోల్​కతా నైట్​రైడర్స్ బెంగళూరు ఛాలెంజర్స్ లైవ్ స్కోర్

ఐపీఎల్​ 14వ సీజన్​లో భాగంగా నేడు (సెప్టెంబర్ 20) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-కోల్​కతా నైట్​రైడర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్​లో తొలుత టాస్ గెలిచిన ఆర్సీబీ బ్యాటింగ్ ఎంచుకుంది.

కోల్​కతా
kkr
author img

By

Published : Sep 20, 2021, 7:02 PM IST

Updated : Sep 20, 2021, 7:14 PM IST

కరోనా కారణంగా అర్ధాంతరంగా వాయిదా పడిన ఐపీఎల్​ రెండో దశ(IPL Second Phase 2021) ఆదివారం నుంచి తిరిగి ప్రారంభమైపోయింది. తొలి మ్యాచ్​లో చెన్నై సూపర్​ కింగ్స్​-ముంబయి ఇండియన్స్​ తలపడగా.. సోమవారం(సెప్టెంబరు 20) రెండో మ్యాచ్​కు రంగం సిద్ధమైంది. ఈ మ్యాచ్​లో రాయల్​ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్​కతా నైడ్​రైడర్స్(RCB Vs KKR 2021) జట్లు​ తలపడనున్నాయి. మొదటగా ఈ మ్యాచ్​లో టాస్ గెలిచిన ఆర్సీబీ బ్యాటింగ్ ఎంచుకుంది.

కోహ్లీ కెప్టెన్సీలో టైటిల్ దక్కేనా?

ఐపీఎల్​ ట్రోఫీ(IPL Trophy RCB) ఆర్సీబీకి అందని ద్రాక్షగానే మిగిలింది. టీ20 ప్రపంచకప్ అనంతరం పొట్టి ఫార్మాట్ కెప్టెన్‌గా వైదొలగనున్న ఆర్సీబీ సారథి కోహ్లీ.. ఈ సీజన్​ తర్వాత ఈ ఫ్రాంచైజీ కెప్టెన్సీ నుంచీ తప్పుకోనున్నట్లు ప్రకటించాడు. ఈ నేపథ్యంలో ఈసారి టైటిల్ నెగ్గి కోహ్లీకి బహుమతిగా ఇవ్వాలని ఆటగాళ్లు ఉవ్విళ్లూరుతున్నారు.

చివరిగా.. 2014 టైటిల్‌ పోరులో వరుసగా తొమ్మిది మ్యాచ్‌లు గెలుపొంది(KKR IPL wins) ట్రోఫీ సాధించిన ఘనచరిత్ర కేకేఆర్ సొంతం. మరి నేటి మ్యాచ్​లో ఎలా రాణిస్తుందో

తెలుగు ఆటగాడికి చోటు

ఆర్సీబీ జట్టు తరఫున ఇద్దరు ఆటగాళ్లు ఐపీఎల్ అరంగేట్రం చేయనున్నారు. ఇందులో తెలుగు క్రికెటర్ కేఎస్ భరత్​ కూడా ఉన్నాడు. అలాగే శ్రీలంక ఆటగాడు వానిందు హసరంగకూ చోటిచ్చారు. కాగా, కోల్​కతా జట్టులో వెంకటేశ్ అయ్యర్​కూ స్థానం కల్పించారు. ఇతడికీ ఇదే తొలి ఐపీఎల్ మ్యాచ్.

జట్లు

కోల్​కతా

శుభ్​మన్ గిల్, నితీశ్ రానా, రాహుల్ త్రిపాఠి, మెర్గాన్ (కెప్టెన్), రసెల్, దినేశ్ కార్తీక్, సునీల్ నరేన్, వెంకటేశ్ అయ్యర్, ఫెర్గుసన్, వరుణ్ చక్రవర్తి, ప్రసిధ్ కృష్ణ

బెంగళూరు

విరాట్ కోహ్లీ (కెప్టెన్), పడిక్కల్, శ్రీకర్ భరత్, మ్యాక్స్​వెల్, డివిలియర్స్, వానిందు హసరంగ, సచిన్ బేబీ, కైల్ జేమీసన్, సిరాజ్, హర్షల్ పటేల్, చాహల్

ఇవీ చూడండి: రెండు దేశాల తరఫున ఆడిన క్రికెటర్లు వీరే!

Last Updated : Sep 20, 2021, 7:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.