ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పకగెలవాల్సిన మ్యాచ్‌లో ఆర్సీబీ రాణించింది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఫాంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌లో సాధికార బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. అలవోకగా ఫోర్లు, సిక్సులు బాది మునుపటి కోహ్లీని గుర్తుకు తెచ్చాడు. అయితే, ఆర్సీబీకి ప్లేఆఫ్స్ బెర్తు ఖరారైనట్లేం కాదు. శనివారం ముంబయితో జరిగే మ్యాచ్‌లో దిల్లీ విజయం సాధిస్తే.. ఆర్సీబీ బదులు దిల్లీనే ప్లేఆఫ్స్‌కు వెళ్తుంది. అయితే, ఈ విజయంతో సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్స్ అవకాశాలు పూర్తిగా మూసుకుపోయాయి. సాంకేతికంగా కూడా ఈ జట్లకు ప్లేఆఫ్స్‌కు వెళ్లే అవకాశం లేదు.
అంతకుముందు, కెప్టెన్ హార్దిక్ పాండ్య (62*), డేవిడ్ మిల్లర్ (34), వృద్ధిమాన్ సాహా (31), రషీద్ ఖాన్ (19*), మ్యాథ్యూ వేడ్ (16) ధాటిగా ఆడటంతో బెంగళూరుకు లఖ్‌నవూ ఓ మోస్తరు లక్ష్యం నిర్దేశించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. దీంతో బెంగళూరుకు 169 పరుగులను లక్ష్యంగా ఉంచింది. శుభ్‌మన్ గిల్ (1), రాహుల్ తెవాతియా (2) విఫలమ్యారు. బెంగళూరు బౌలర్లలో జోష్ హేజిల్‌వుడ్ 2.. గ్లెన్ మ్యాక్స్‌వెల్, హసరంగ చెరో వికెట్ తీశారు.
ఇదీ చదవండి: చరిత్ర సృష్టించిన తెలుగు తేజం నిఖత్ జరీన్.. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పసిడి పంచ్..