కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతోన్న ఐపీఎల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ బ్యాట్స్‌మెన్ తడబడ్డారు. దీంతో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆర్సీబీ 19 ఓవర్లలో 92 పరుగులు చేయగలిగింది. ఇప్పటికే తన ఫామ్‌లేమితో సతమవుతోన్న కోహ్లీ ఈ మ్యాచ్‌లోనైనా ఆకట్టుకుంటాడని అభిమానులు భావించారు. కానీ వారిని మరోసారి నిరాశపరుస్తూ 5 పరుగులకే పెవిలియన్ చేరాడీ స్టార్ క్రికెటర్. కాసేపు క్రీజులో నిలిచిన మరో ఓపెనర్ దేవదత్ పడిక్కల్ 22 పరుగులు చేసి ఫెర్గుసన్ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కాసేపటికే ఐపీఎల్లో మొదటి మ్యాచ్ ఆడుతున్న తెలుగు కుర్రాడు కేఎస్ భరత్ (16) రసెల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అనంతరం డివిలియర్స్ (0) డకౌట్‌గా వెనుదిరగడం వల్ల 52 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది ఆర్సీబీ.
ఎన్నో ఆశలు రేపిన మ్యాక్స్‌వెల్ (10) కూడా ఆకట్టుకనే ప్రదర్శన చేయలేకపోయాడు. ఐపీఎల్లో తొలి మ్యాచ్ ఆడుతున్న లంక ఆటగాడు హసరంగ డకౌట్‌గా వెనుదిరిగాడు. జేమిసన్ (4), హర్షల్ పటేల్ (12), సిరాజ్ (8) కూడా విఫలమవడం వల్ల 92 పరుగులకే ఆలౌటైంది ఆర్సీబీ.
కోల్‌కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, రసెల్ 3 వికెట్లతో సత్తాచాటగా.. ఫెర్గుసన్ 2, ప్రసిధ్ ఒక వికెట్ దక్కించుకున్నారు.