ETV Bharat / sports

బూట్లు లేని స్థితి నుంచి ఐపీఎల్​లో అదరగొట్టి.. - చేతన్ సకారియా ఐపీఎల్

రాజస్థాన్ రాయల్స్​ బౌలర్ 23 ఏళ్ల​ చేతన్ సకారియా.. పంజాబ్​తో సోమవారం జరిగిన మ్యాచ్​లో అద్భుత ప్రదర్శన చేశాడు. అరంగేట్రంలోనే సత్తా చాటి పలువురి చేత శెభాష్​ అనిపించుకుంటున్నాడు. అయితే ఒకప్పుడు కనీసం వేసుకోవడానికి బూట్లు లేని స్థితి నుంచి వచ్చాడు ఈ యువ బౌలర్​. ప్రస్తుతం తన బౌలింగ్​తో క్రికెట్ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్నాడు.​ ​

Chetan sakariya, saurashtra sakariya
చేతన్ సకారియా, రాజస్థాన్​ రాయల్స్​ బౌలర్​ సకారియా
author img

By

Published : Apr 13, 2021, 7:17 AM IST

పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ బౌలింగ్‌ దాడిని ఆరంభించేందుకు ఓ కుర్రాడు బంతి అందుకోవడం ఆశ్చర్యం కలిగించింది. ఆ తర్వాత తన పేస్‌, స్వింగ్‌తో అతను.. తన రెండో ఓవర్లోనే మయాంక్‌ వికెట్​ తీసుకున్నాడు. ఇన్నింగ్స్‌ చివరి ఓవర్లో శతకం దిశగా సాగుతున్న కేఎల్‌ రాహుల్‌తో పాటు రిచర్డ్‌సన్‌ను ఔట్‌ చేయడమే కాకుండా ఫీల్డింగ్‌లోనూ ఓ అద్భుతమైన క్యాచ్‌ అందుకుని మరింత ఆశ్చర్యపరిచాడు. అతనే 23 ఏళ్ల చేతన్‌ సకారియా. ఈ ఏడాది ఐపీఎల్‌ వేలంలో రూ.1.2 కోట్ల ధరతో రాజస్థాన్‌తో చేరిన అతను.. ఈ మ్యాచ్‌తో ఐపీఎల్‌లో అడుగుపెట్టాడు. అరంగేట్ర మ్యాచ్‌లోనే సత్తాచాటిన ఈ యువ పేసర్‌కు ఓ దశలో క్రికెట్‌ ఆడేందుకు బూట్లు కూడా లేవంటే నమ్మగలరా? కానీ అదే నిజం.

ఇదీ చదవండి: ముంబయి Vs కోల్​కతా: రెండో మ్యాచ్​లో గెలుపెవరిది?

గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు 180 కిలోమీటర్ల దూరంలోని కుగ్రామమైన వార్టెజ్‌కు చెందిన ఈ లెఫ్టార్మ్‌ పేసర్‌ పేద కుటుంబంలో పుట్టాడు. చిన్నప్పటి నుంచే క్రికెట్‌పై ఆసక్తి పెంచుకుని టెన్నిస్‌ బంతితో ఆడేవాడు. మొదట్లో బ్యాట్స్‌మన్‌గా ఆడిన అతను.. ఆ తర్వాత తన పాఠశాలలో అందరి దృష్టిని ఆకర్షించడం కోసం ఫాస్ట్‌బౌలర్‌గా మారాడు. 16 ఏళ్ల వరకూ ఎలాంటి శిక్షణ లేకుండానే సొంత నైపుణ్యాలతో ఎదిగాడు. ఆ తర్వాత సౌరాష్ట్ర తరఫున జూనియర్‌ జట్టుకు ఎంపికయ్యాడు. అయితే 17 ఏళ్ల వయసులో గాయంతో ఏడాది పాటు ఆటకు దూరమైన అతను.. కుటుంబ పోషణ భారం కావడం వల్ల తన మేనమామ వ్యాపారం చూసుకుంటూ సాధన కొనసాగించాడు. ఆ తర్వాత కూచ్‌ బెహార్‌ ట్రోఫీలో అద్భుత ప్రదర్శనతో ఎమ్‌ఆర్‌ఎఫ్‌ పేస్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఆసీస్‌ దిగ్గజ పేసర్‌ మెక్‌గ్రాత్‌ దగ్గర శిక్షణ పొందే అవకాశం దక్కింది. అక్కడి నుంచి అతను వెనుదిరిగి చూసుకోలేదు. అయితే ఆ ఫౌండేషన్‌కు వెళ్లేముందు అతనికి బూట్లు కూడా లేవు. అప్పుడు నెట్స్‌లో అతని బౌలింగ్‌కు ఫిదా అయిన సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ షెల్డన్‌ జాక్సన్‌ చేతన్‌కు జత బూట్లు ఇచ్చాడు. ఆ తర్వాత 2018-19 సీజన్‌లో రంజీల్లో అడుగుపెట్టాడు.

ఇదీ చదవండి: ఉత్కంఠ పోరులో​ రాజస్థాన్​పై పంజాబ్ గెలుపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.