ఐపీఎల్ 14వ సీజన్లో దాదాపు సగం మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఆరెంజ్ క్యాప్(ఎక్కువ పరుగులు చేసిన వారికి ఇచ్చే టోపీ), పర్పుల్ క్యాప్(ఎక్కువ వికెట్లు తీసిన వారికి ఇచ్చే టోపీ).. విభాగాలలో సత్తా చాటుతున్న క్రికెటర్లు ఎవరో చూసేయండి.
పంజాబ్ కింగ్స్ సారథి కేఎల్ రాహుల్.. ఈ సీజన్లో అత్యుత్తమ ఫామ్ కనబరుస్తున్నాడు. బెంగళూరుతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో 91 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన రాహుల్(331).. అత్యధిక పరుగుల జాబితాలో అగ్రస్థానంలోకి దూసుకెళ్లాడు. నిన్నటి మ్యాచ్‌తో.. శిఖర్ ధావన్(311) నుంచి ఆరెంజ్ క్యాప్ లాగేసుకున్నాడు. డుప్లెసిస్(270), పృథ్వీ షా(269), సంజూ శాంసన్(6 మ్యాచ్‌ల్లో 229 పరుగులు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
బౌలింగ్‌లో వీరే..
బౌలింగ్ విభాగంలో దేశవాళీ క్రికెటర్లు సత్తా చాటుతున్నారు. ఆర్సీబీ బౌలర్ హర్షల్ పటేల్(17) ప్రస్తుతం పర్పుల్ క్యాప్‌తో ఉన్నాడు. అవేశ్ ఖాన్- దిల్లీ (13), రాహుల్ చాహర్- ముంబయి (11), మోరిస్- రాజస్థాన్ (11) వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
ఇదీ చదవండి: ఐపీఎల్ టైటిలే లక్ష్యంగా చెన్నై 'కింగ్స్' గర్జన
ఇదీ చదవండి: ఫుట్‌బాల్ స్టార్ రొనాల్డో నుంచి రూ.579 కోట్ల డిమాండ్!