ఐపీఎల్.. అనిల్ కుంబ్లేను పంజాబ్ కోచ్ బాధ్యతల నుంచి తప్పించనున్నారా? ఆ పదవిలో కొత్త వ్యక్తిని నియమించబోతున్నారా? అంటే అవుననే సమాధానం ఐపీఎల్ వర్గాల నుంచి వినిపిస్తోంది. ఈ సెప్టెంబర్‌తో కుంబ్లేకు పంజాబ్ కింగ్స్‌తో ఉన్న మూడేళ్ల ఒప్పందం ముగియనుంది. ఈ నేపథ్యంలోనే కుంబ్లేతో ఉన్న ఒప్పందాన్ని రెన్యువల్ చేసుకునేందుకు పంజాబ్ కింగ్స్ సుముఖంగా లేనట్లు తెలుస్తోంది.
ఇప్పటికే పంజాబ్ కింగ్స్.. కొత్త కోచ్ పదవికి రేసులో ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు ఇయాన్ మోర్గాన్ సహా హైదరాబాద్ మాజీ కోచ్ ట్రెవర్ బెలిస్, టీమ్ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, మరో వారంలో పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ ఎవరనే దానిపై సందిగ్దం వీడనుందని ఓ ఫ్రాంచైజీ అధికారి పేర్కొన్నారు.
కుంబ్లే హయాంలో పంజాబ్ కింగ్స్ ఐపీఎల్‌లో 42 మ్యాచ్‌ల్లో 19 విజయాలు అందుకుంది. అతడి కోచింగ్‌లో వరుసగా నాలుగు సీజన్లలోనూ ఆరో స్థానంతోనే సరిపెట్టుకుంది. నాలుగు సీజన్లలో ముగ్గురు కెప్టెన్లను, ప్లేయర్లను మార్చినా ఫలితం మాత్రం మారలేదు. అందుకే కుంబ్లేకు వీడ్కోలు చెప్పి, కొత్త హెడ్ కోచ్‌ను నియమించుకునేందుకు పంజాబ్ ప్రయత్నాలు చేస్తోంది.
ఇదీ చదవండి: