ETV Bharat / sports

పృథ్వీషా వింత అలవాటు.. బయటపెట్టిన పాంటింగ్ - ipl news

గత ఐపీఎల్​​లో పృథ్వీషాతో తనకెదురైన అనుభవం గురించి దిల్లీ కోచ్ పాంటింగ్ వెల్లడించాడు. వింత అలవాటు మార్చుకోమని అతడికి సూచించినట్లు తెలిపాడు. ఈ సీజన్​లో దిల్లీ క్యాపిటల్స్ తన తొలి మ్యాచ్​ చెన్నై సూపర్​కింగ్స్​తో ఆడనుంది.

Prithvi Shaw Refused To Bat In Nets When Not Scoring Runs Last IPL Season: Ricky Ponting
పృథ్వీషాకు వింత అలవాటు.. బయటపెట్టిన పాంటింగ్
author img

By

Published : Apr 5, 2021, 7:18 PM IST

దిల్లీ క్యాపిటల్స్​ కోచ్​ రికీ పాంటింగ్.. ఆ జట్టు బ్యాట్స్​మన్ పృథ్వీషాకు ఉన్న వింత అలవాటు గురించి చెప్పాడు. గతేడాది ఐపీఎల్​ సందర్భంగా ఈ విషయాన్ని తెలుసుకున్నానని అన్నాడు. అయితే ఈ అలవాటు కెరీర్​కు ఏమాత్రం మంచిది కాదని అతడితో చెప్పినట్లు పేర్కొన్నాడు.

ఇంతకీ ఏం జరిగింది?

గత సీజన్​లో దిల్లీ క్యాపిటల్స్​ ఓపెనర్​గా వచ్చిన యువ క్రికెటర్ పృథ్వీషా ఘోరంగా విఫలమయ్యాడు. 13 మ్యాచ్​ల్లో 228 పరుగులు మాత్రమే చేశాడు.

గత సీజన్​లో 10 కంటే తక్కువ పరుగుల చేసిన నాలుగు సందర్భాల్లో పృథ్వీ షాతో తాను మాట్లాడానని, అప్పడు తన కళ్లల్లోకి చూసిన అతడు.. మ్యాచ్​లో స్కోరు చేయకపోతే నెట్స్​లో ప్రాక్టీసు చేయనని తనతో చెప్పినట్లు పాంటింగ్ వెల్లడించాడు. ఇది ఏ మాత్రం మంచిది కాదని చెప్పి, అతడికి బ్యాటింగ్​లో సలహాలు ఇచ్చినట్లు తెలిపాడు.

Prithvi Shaw Refused To Bat In Nets
విజయ్ హజారే ట్రోఫీలో పృథ్వీషా

అయితే ఐపీఎల్​ పూర్తయిన కొద్దిరోజులకే విజయ్ హజారే టోర్నీలో పాల్గొన్న పృథ్వీషా ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 8 మ్యాచ్​ల్లో 827 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే ఓ సీజన్​లో 800 కంటే ఎక్కువ పరుగుల చేసిన తొలి బ్యాట్స్​మన్​గా నిలిచాడు. దీంతో ఈ సీజన్​లో షా పరుగుల వరద పారిస్తాడని పాంటింగ్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.