కోల్‌కతా నైట్ రైడర్స్ ఆటగాడు వరుణ్ చక్రవర్తికి(varun chakravarthy news) ఐపీఎల్ 2021(ipl 2021 schedule) ఓ పీడకల లాంటింది. ఐపీఎల్ తొలి దశలో అతడికే మొదటగా కొవిడ్ సోకింది. అక్కడి నుంచి వివిధ జట్లలో ఆటగాళ్లకు పాజిటివ్‌గా తేలడం వల్ల మొత్తం లీగ్‌నే వాయిదా వేశారు. ఆదివారం(అక్టోబరు 10) వరల్డ్ మెంటల్ హెల్త్ డే సందర్భంగా కేకేఆర్ విడుదల చేసిన వీడియోలో.. ఆ చీకటి రోజులను గుర్తుచేసుకున్నాడు వరుణ్. 'వరుణ్ చచ్చిపోయుంటే బాగుండేది' అని ప్రజలు అన్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.
"నాకు ఇంకా గుర్తు. డాక్టర్ ఫోన్ చేసి నాకు పాజిటివ్ అని చెప్పాడు. నేను వణికిపోయాను. అంతా నాశనం అయిపోయింది అనిపించింది. ఇంత జరుగుతుంది(సీజన్ వాయిదా) అని అప్పట్లో నేను ఊహించలేదు. ప్రజలు నాకు వ్యతిరేకంగా మాట్లాడటం మొదలుపెట్టారు. 'కొవిడ్ కన్నా వరుణ్ మొత్తానికే చచ్చిపోయుంటే బాగుండేది' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో నాకు మెసేజ్‌లు పంపారు."
-- వరుణ్ చక్రవర్తి, కేకేఆర్ ఆటగాడు.
కేకేఆర్ ఆటగాళ్లు వరుణ్‌కు మద్దతుగా నిలిచారు. 'సామాజిక మాధ్యమాలు కాస్త దయకలిగి ఉండాలని అనిపించింది. తమ మాటల ప్రభావం ఎంత ఉంటుందనేది ప్రజలు ఆలోచించరు. మీమ్స్, వీడియోలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఆ సమయంలో వారికి నచ్చింది మాట్లాడతారు. అది చదువుతున్న మనిషి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడనేది వారు పట్టించుకోరు,' అని సీనియర్ ఆటగాడు దినేశ్ కార్తిక్ అన్నాడు.
వరుణ్ ఎప్పుడు జాగ్రత్తగా ఉంటాడని, ప్రతి విషయాన్ని సీరియస్‌గా తీసుకుంటాడని.. అలాంటిది అతడికి ఇలా జరగడం దురదృష్టకరమని టీమ్ సభ్యులు అభిప్రాయపడ్డారు.
-
In a world where you can be anything, be kind 💜
— KolkataKnightRiders (@KKRiders) October 10, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
This #WorldMentalHeathDay, let's pledge to refrain from social media trolling as you never know the damage it may cause.#KKRFilms x Payments on @amazonIN #PayAmazonSe #KKR #IPL2021 pic.twitter.com/EQO3ZvTOn5
">In a world where you can be anything, be kind 💜
— KolkataKnightRiders (@KKRiders) October 10, 2021
This #WorldMentalHeathDay, let's pledge to refrain from social media trolling as you never know the damage it may cause.#KKRFilms x Payments on @amazonIN #PayAmazonSe #KKR #IPL2021 pic.twitter.com/EQO3ZvTOn5In a world where you can be anything, be kind 💜
— KolkataKnightRiders (@KKRiders) October 10, 2021
This #WorldMentalHeathDay, let's pledge to refrain from social media trolling as you never know the damage it may cause.#KKRFilms x Payments on @amazonIN #PayAmazonSe #KKR #IPL2021 pic.twitter.com/EQO3ZvTOn5
యూఏఈకి...
ఐపీఎల్ తొలి దశలో.. ఆర్సీబీతో మ్యాచ్‌కు ముందు కేకేఆర్ ఆటగాడు వరుణ్ చక్రవర్తికి కరోనా సోకింది. దీంతో ఆ మ్యాచ్ వాయిదా పడింది. ఆ తర్వాత టోర్నీలో కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో ఐపీఎల్‌ను వాయిదా వేస్తున్నట్టు నిర్వాహకులు నిర్ణయించారు. అలా మే నెలలో వాయిదా పడిన ఐపీఎల్-2021.. యూఏఈలో సెప్టెంబర్‌లో తిరిగి ప్రారంభమైంది.
ఇవీ చూడండి:-
'ఆ రెండు రోజులు నిద్ర పట్టలేదు'