ఆస్ట్రేలియా పేసర్ పాట్ కమిన్స్ పెద్ద మనసు చాటుకున్నాడు. ఆక్సిజన్ సరఫరా కోసం రూ.37.36 లక్షల(50వేల డాలర్లు)ను పీఎం కేర్స్ నిధికి అందించాడు. కరోనా చికిత్స అందిస్తున్న ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సౌకర్యాలను మెరుగుపర్చడం కోసం ఈ విరాళం ఇచ్చాడు. ప్రస్తుతం భారత్ వేదికగా జరుగుతున్న ఐపీఎల్లో కోల్‌కతా తరఫున ఆడుతున్నాడు కమిన్స్.
"ప్రస్తుత కొవిడ్ పరిస్థితుల్లో ఐపీఎల్‌ను నిర్వహించడం అవసరమా అనే చర్చ ఇండియాలో జరుగుతోంది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భారతదేశంలో లాక్‌డౌన్‌ను పోలిన పరిస్థితులు ఉన్నాయి. ప్రజలకు కష్టమైన ఈ సమయంలో వారికి కొంత ఆనందం, విశ్రాంతి ఇవ్వాలని మేము అనుకుంటున్నాం" అని కమిన్స్ ట్విట్టర్లో పేర్కొన్నాడు.
ఇదీ చదవండి: 'ఆటగాళ్లు నిష్క్రమిస్తున్నా.. ఐపీఎల్ కొనసాగుతుంది'
"భారతదేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. నా సహచర ఐపీఎల్ ఆటగాళ్లతో పాటు, ప్రపంచంలోని క్రీడాకారులందరూ సాయం అందించండి. నా వంతుగా రూ.37.36 లక్షలు ఇస్తున్నాను" అని కమిన్స్ తెలిపాడు.
- — Pat Cummins (@patcummins30) April 26, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
— Pat Cummins (@patcummins30) April 26, 2021
">— Pat Cummins (@patcummins30) April 26, 2021
ఇదీ చదవండి: ఆర్చరీ ప్రపంచకప్: స్వర్ణాలతో మెరిసిన దాస్, దీపిక