ETV Bharat / sports

టీమ్​ఇండియా బౌలర్​గా అదే నా కోరిక: సిరాజ్ - cricket news

దేశ జట్టు తరఫున ఎక్కువ వికెట్లు తీయడమే లక్ష్యమని సిరాజ్ చెప్పాడు. కోచ్ భరత్ అరుణ్​తో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. వీటితో పాటు పలు ఆసక్తికర విషయాల్ని పంచుకున్నారు.

My dream is to be the highest wicket-taker for India, says Mohammed Siraj
టీమ్​ఇండియా బౌలర్​గా అదే నా కోరిక: సిరాజ్
author img

By

Published : Apr 8, 2021, 10:18 PM IST

టీమ్‌ ఇండియా బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌ తనను సొంత కొడుకులా చూసుకుంటాడని ఆర్సీబీ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ అన్నాడు. బెంగళూరు టీమ్ గురువారం విడుదల చేసిన ఓ వీడియోలో మాట్లాడిన సిరాజ్‌.. తన కెరీర్‌ గురించి అనేక అంశాలు పంచుకున్నాడు. టీమ్‌ ఇండియా తరఫున అత్యధిక వికెట్లు తీయడమే తన కోరికని చెప్పాడు.

'టీమ్‌ ఇండియాకు నేను బౌలింగ్‌ చేసినప్పుడల్లా జస్ప్రీత్‌ బుమ్రా నా పక్కనే ఉండేవాడు. ప్రాథమిక అంశాలకు లోబడి బౌలింగ్‌ చేయమని, అనవసర విషయాలపై దృష్టి పెట్టొద్దని చెప్పాడు. అతడి నుంచి నేర్చుకోవడం గొప్ప విషయం. అలాగే ఇషాంత్‌ శర్మతోనూ కలిసి ఆడాను. అతను వంద టెస్టులాడాడు. అతనితో డ్రెస్సింగ్‌ రూమ్‌ పంచుకోవడం మరచిపోలేనిది. టీమ్ ‌ఇండియా తరఫున అత్యధిక వికెట్లు తీయడమే నా ఆశయం. అందుకు అవకాశం వచ్చినప్పుడల్లా కష్టపడతా' అని సిరాజ్‌ చెప్పుకొచ్చాడు.

'ఆస్ట్రేలియా పర్యటనలో క్వారంటైన్‌లో ఉండగా, ప్రాక్టీస్‌ నుంచి తిరిగొచ్చాక మా నాన్న లేరనే దుర్వార్త తెలిసింది. దురదృష్టం కొద్దీ ఆ సమయంలో నా గదికి ఎవరూ వచ్చే అవకాశం లేకపోయింది. అప్పుడు మా అమ్మకు ఫోన్‌ చేశా. తను ఎంతో అండగా నిలిచింది. టీమ్‌ ఇండియాకు ఆడాలన్న మా నాన్న కోరిక నెరవేర్చాలని చెప్పింది' అని సిరాజ్‌ నాటి చేదువార్తను గుర్తుచేసుకున్నాడు.

టీమ్‌ ఇండియా బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌తో మాట్లాడినప్పుడల్లా తన ఆత్మవిశ్వాసం పెరుగుతుందని చెప్పాడు. భరత్‌ హైదరాబాద్‌లో ఉన్నప్పుడు తన బౌలింగ్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని తెలిపాడు. టీమ్ఇండియా తరఫున మూడు ఫార్మాట్లలోనూ ఆడాలని ఉందని, ఏ అవకాశం వచ్చినా 100 శాతం రాణించాలని ఉంటుందని సిరాజ్‌ చెప్పుకొచ్చాడు. చివరగా గతేడాది ఐపీఎల్‌పై స్పందిస్తూ.. అందులో తాను కొత్తగా చేరినప్పుడు పూర్తి స్థాయిలో సిద్ధంగా లేనన్నాడు. కొత్త బంతితో బౌలింగ్‌ చేసేకొద్దీ అలవాటు పడ్డానన్నాడు. తర్వాత కేకేఆర్‌(4-2-8-3)తో అత్యుత్తమ ప్రదర్శన చేసినప్పుడు తన ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యిందని చెప్పాడు. ఆర్సీబీ తీరు‌ బాగుంటుందని, అందరూ కలిసి మాట్లాడుకోవచ్చని సిరాజ్‌ వివరించాడు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.