ఐపీఎల్లో వికెట్ కీపర్లు కెప్టెన్లుగా ఉండటం గురించి రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు బట్లర్ మాట్లాడాడు. ఈ విషయంలో ఫ్రాంఛైజీలు స్టార్ క్రికెటర్ ధోనీని ప్రేరణగా తీసుకుని ఉంటాయని అన్నాడు. ప్రస్తుత సీజన్‌లోని ఎనిమిది జట్లలో నాలుగింటిలో వికెట్ కీపర్లు సారథులుగా ఉన్నారు. 2008 లీగ్ ప్రారంభమైనప్పటి నుంచి చెన్నై సూపర్‌కింగ్స్‌కు కెప్టెన్‌గా ఉన్నాడు మహీ. ఇప్పుడు పంజాబ్‌కు కేఎల్ రాహుల్, రాజస్థాన్‌కు సంజూ శాంసన్, దిల్లీకి పంత్ సారథులుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
వికెట్ కీపర్‌గా ఉండి కెప్టెన్సీని సమర్థంగా నిర్వర్తించే విషయంలో ధోనీ, ఐపీఎల్లో ట్రెండ్ చేశాడు. బహుశా మహీని ప్రేరణగా తీసుకుని మిగతా ఫ్రాంఛైజీలు కూడా ఇలా సారథ్య బాధ్యతలు కీపర్లకు అప్పగించాయని అనుకుంటున్నాను. అతడొక అద్భుతమైన నాయకుడు.
-జోస్ బట్లర్, రాజస్థాన్ రాయల్స్ క్రికెటర్
స్వయంగా వికెట్ కీపర్ అయిన బట్లర్.. కీపర్లకు కెప్టెన్‌గా ఉండటం అదనపు ప్రయోజనమని తెలిపాడు. ఆట పట్ల సరైన అవగాహన కలిగి ఉండొచ్చని పేర్కొన్నాడు. వికెట్ ఎలా స్పందిస్తుంది? ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి.. బౌలర్లు ఎలా బంతిని వేస్తున్నారనేది తెలుసుకోవచ్చని అభిప్రాయపడ్డాడు.
ఇదీ చదవండి: ఐపీఎల్: స్లో ఓవర్ రేట్.. ధోనీకి జరిమానా
రాజస్థాన్ కెప్టెన్‌గా శాంసన్ మెరుగైన ఫలితాలను సాధిస్తాడని బట్లర్ ధీమా వ్యక్తం చేశాడు. నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుపోవడంలో సంజూ దిట్ట అని అన్నాడు. జట్టుతో చాలా కాలంగా అతడికి సన్నిహిత సంబంధాలున్నాయని వెల్లడించాడు. ప్రస్తుత సీజన్లో తమ జట్టుకు బెన్ స్టోక్స్ కీలక ఆటగాడిలా మారతాడని పేర్కొన్నాడు. ఈ సారి జట్టులో చాలా మార్పులు జరిగాయని.. ప్రపంచ స్థాయి ఆల్‌రౌండర్లు బెన్ స్టోక్స్, క్రిస్ మోరిస్ జట్టులో ఉండటం అదనపు బలమని తెలిపాడు.
అంతర్జాతీయ క్రికెట్ అనుభవం ఉన్న కుమార సంగక్కర తమ జట్టు డైరెక్టర్‌గా ఉండటం తమకు సానుకూలంశమని బట్లర్ పేర్కొన్నాడు. పొట్టి క్రికెట్ ఆడిన అతడి జ్ఞానం టీమ్‌కు ఉపయోగపడుతుందని తెలిపాడు.
ఇదీ చదవండి: డ్రెస్సింగ్ రూమ్‌లో గబ్బర్, పృథ్వీ షా డ్యాన్స్