MS Dhoni Retirement IPL : ఐపీఎల్ 16వ సీజన్లో ఎక్కడ.. ఏ మ్యాచ్ జరుగినా.. ధోనీ ధోనీ అంటూ మైదానం మారుమోగిపోయింది. స్టేడియం మొత్తం పసుపు వర్ణంతో మెరిసింది. దీనికి కారణం ధోనీకి ఉన్న అశేష అభిమానగణమే. ఇప్పుడీ దిగ్గజ ప్లేయర్ రిటైర్మెంట్పై తెగ చర్చ నడుస్తోంది. ఈ విషయంలో ధోనీ ఏ నిర్ణయం తీసుకుంటాడో అని అటు ఫ్యాన్య్తో పాటు ఇటు ప్లేయర్లు, మాజీలు కూడా ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. అప్పుడప్పుడు మాజీ క్రికెటర్లు ఈ విషయంపై తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. అయితే గత కొన్ని రోజుల నుంచి వెలువడుతున్న విశ్లేషణలు, జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే.. ధోనికి ఇదే చివరి ఐపీఎల్ అనే సందేహం కలుగుతోంది. దీనికి బలం చేకూర్చేలా ఆదివారం కోల్‌కతా, చెన్నై మధ్య జరిగిన మ్యాచ్‌లో కొన్ని అనుమానాస్పద ఘటనలు జరిగాయి.
ఈ కోల్‌కతా, చెన్నై మ్యాచ్ అనంతరం ప్లేయర్లంతా మైదానంలో కలియతిరిగారు. దీనికి తోడు అలనాటి క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ తన షర్ట్‌పై.. ధోనీ ఆటోగ్రాఫ్‌ను తీసుకున్నాడు. దీంతో ధోనీకిదే చివరి ఐపీఎల్ అనే అనుమానాలు బలపడ్డాయి. మరోవైపు టీమ్ఇండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ కూడా ఈ అనుమానాన్నే వ్యక్తం చేశారు. 'నేను అనుకుంటున్న దాని ప్రకారం.. ఇదే తన చివరి ఐపీఎల్ అని ఇప్పటికే ధోనీ చాలా హింట్స్ ఇచ్చాడు. తన నిర్ణయాన్ని అంచనా వేయడాన్ని క్రికెట్ ప్రపంచానికే వదిలేశారు. ఇలా చేయడం ఆయన నేచర్. నాకు తెలిసినంత వరకు ధోనీ వచ్చే ఐపీఎల్లో ఆడడు' అని కైఫ్ అభిప్రాయపడ్డాడు. అయితే, సునీల్ గావస్కర్ ఇప్పటి వరకు ఎవరి ఆటోగ్రాఫ్ తీసుకోలేదని.. అలాంటిది ధోనీ సంతకం తీసుకున్నాడంటే.. అతడు ఎంత గొప్ప ఆటగాడో అర్థమవుతుంది అని కైఫ్ చెప్పుకొచ్చాడు. దీనికి భిన్నంగా చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ కాశీ విశ్వనాథన్ స్పందించారు. ధోనీ వచ్చే సీజన్లో కూడా ధోనీ ఆడతాడని.. అందుకు అభిమానులు ఎల్లవేళలా అతడికి ఇలాగే సపోర్ట్ చేయాలని కోరాడు.
ధోనీ అన్ని అంతర్జాతీయ ఫార్మాట్ల నుంచి రిటైర్ అవడానికి ముందు కూడా అతడి రిటైర్మెంట్పై ఇలాగే పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అప్పుడు కూడా ధోనీ ఏదీ వెల్లడించలేదు. అభిమానులకే వదిలేశారు. చివరకు 15 ఆగస్టు 2020న రిటైర్మెంట్ ప్రకటించాడు. ఏది ఏమైన ధోనీ ఫ్యాన్స్‌కు ఇది మింగుడుపడని విషయమనే చెప్పాలి. ఆదివారం మైదానంలో జరిగిన అనుమానాస్పద ఘటనపై రకరకాలుగా స్పందించారు అభిమానులు.
-
It's over for MSD in IPL🥹
— Haider Khan 🇮🇳💚 (@ind_iw0) May 14, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
We will miss u
">It's over for MSD in IPL🥹
— Haider Khan 🇮🇳💚 (@ind_iw0) May 14, 2023
We will miss uIt's over for MSD in IPL🥹
— Haider Khan 🇮🇳💚 (@ind_iw0) May 14, 2023
We will miss u