ETV Bharat / sports

సీఎస్కే లిటిల్​ ఫ్యాన్​కు ధోనీ నుంచి చిరు కానుక - ధోనీ ఇన్నింగ్స్​

ఐపీఎల్​(IPL 2021) ఫైనల్​కు చెన్నై సూపర్​కింగ్స్​ జట్టు చేరడంపై ఆ టీమ్​ ఫ్యాన్స్​ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. దిల్లీతో జరిగిన మ్యాచ్​లో సీఎస్కే కెప్టెన్​ ధోనీ(CSK Captain 2021) సూపర్​ ఇన్నింగ్స్​ చూసిన ఓ చిన్నారి అభిమాని భావోద్వేగానికి లోనయ్యింది. అది చూసిన కెప్టెన్​ ధోనీ.. ఆటోగ్రాఫ్​ చేసిన ఓ బంతిని ఆ చిన్నారికి బహుమతిగా అందించాడు.

MS Dhoni gifts autographed ball to young kid who was crying During The Match
సీఎస్​కే లిటిల్​ ఫ్యాన్​కు ధోనీ నుంచి చిరు కానుక
author img

By

Published : Oct 11, 2021, 5:34 PM IST

దిల్లీ క్యాపిటల్స్​తో(DC Vs CSK 2021) జరిగిన మ్యాచ్​లో చెన్నై సూపర్​కింగ్స్​ కెప్టెన్​ మహేంద్రసింగ్​ ధోనీ.. చివర్లో వరుస బౌండరీలతో తమ జట్టును గెలిపించాడు. మెరుపు షాట్లతో వింటేజ్​ మహీని చూసిన ఓ చిన్నారి అభిమాని కళ్ల నుంచి ఆనందభాష్పాలు రాలాయి. ఆ సంఘటన కెమెరా కంట పడగా.. ఆ చిన్నారిని చూసిన ప్రేక్షకులతో పాటు ధోనీ మనసు కూడా కరిగింది. దీంతో మ్యాచ్​ అనంతరం తన ఫ్యాన్​కు ధోనీ ఓ సర్​ప్రైజ్​ గిఫ్ట్​ అందించాడు. తాను సంతకం చేసిన ఓ బంతిని ఆ చిన్నారికి అందజేశాడు. అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్​గా మారాయి.

సంతోషం.. భావోద్వేగం..

అదే విధంగా ధోనీ సూపర్​ ఇన్నింగ్స్​ను ప్రత్యక్షంగా చూసిన అతని భార్య సాక్షి.. స్టాండ్స్​లో ఎంతో ఉత్సాహంగా కనిపించింది. చెన్నై జట్టు విజయం సాధించిన తర్వాత తమ పాప జీవాను హత్తుకొని సాక్షి భావోద్వేగానికి లోనయ్యింది. దీనికి సంబంధించి వీడియో ఇప్పుడు వైరల్​గా మారింది.

ఐపీఎల్ 14వ సీజన్‌(IPL 2021 News)లో చెన్నై సూపర్‌ కింగ్స్‌(chennai super kings 2021) ఫైనల్‌ చేరింది. ఐపీఎల్​ చరిత్రలో తొమ్మిదోసారి ఫైనల్​కు చేరుకున్న టీమ్​గా సీఎస్కే నిలిచింది. ఆదివారం రాత్రి దిల్లీ క్యాపిటల్స్‌(DC Vs CSK 2021)తో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో చెన్నై రెండు బంతులు మిగిలుండగానే విజయం సాధించింది. ధోనీ (18 నాటౌట్‌; 6 బంతుల్లో 3x4, 1x6) మునుపటిలా ఫినిషర్‌ పాత్ర పోషించి మ్యాచ్‌ను గెలిపించిన తీరు అభిమానులకు కొత్త ఉత్సాహాన్ని కలిగించింది.

ఇదీ చూడండి.. ఆ పరిస్థితుల నుంచి బయటపడాలనుకున్నా: ధోనీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.