ETV Bharat / sports

dhoni catches record: ఐపీఎల్​లో ధోనీ సరికొత్త రికార్డు - సీఎస్కే ధోనీ రికార్డ్స్​

ఐపీఎల్​లో విజయవంతమైన కెప్టెన్​గా పేరు తెచ్చుకున్న ధోనీ.. మరో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. క్యాచుల్లో అందరి కంటే ముందు ఓ మార్క్​ను అందుకున్నాడు. ఇంతకీ ఆ రికార్డు ఏంటి?

IPL 2021
ధోనీ
author img

By

Published : Oct 1, 2021, 9:20 AM IST

చెన్నై సూపర్​కింగ్స్​ కెప్టెన్ ధోనీ సరికొత్త రికార్డును అందుకున్నాడు. సీఎస్కే తరపున 100 క్యాచ్​లు పట్టిన ఆటగాడిగా నిలిచాడు. సన్​రైజర్స్​ హైదరాబాద్​తో గురువారం జరిగిన మ్యాచ్​లో పట్టిన మూడు క్యాచ్​లతో ఈ ఘనత సొంతం చేసుకున్నాడు. సురేశ్​ రైనా(98 క్యాచ్​లు), ముంబయి ఇండియన్స్​ తరపున పొలార్డ్​(94 క్యాచ్​లు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

వికెట్​ కీపర్​గా టాప్​..

ఐపీఎల్​లో అత్యధిక క్యాచ్​లు అందుకున్న వికెట్​ కీపర్​గా ధోనీకి ఇప్పటికే రికార్డ్​ ఉంది. 215 మ్యాచ్​లలో 158 ఆటగాళ్లను ఔట్​ చేశాడు. టీ20ల్లో 119 క్యాచ్​లు, 39 స్టంపౌట్లు చేశాడు. ఐపీఎల్​లో బ్యాటింగ్​లో అంతగా రాణించలేకపోయినా.. సీఎస్కే విజయంలో ధోనీది కీలక పాత్ర. ఫీల్టిండ్​, బౌలింగ్​ మార్పులు వంటి వ్యూహాత్మకత ప్లాన్స్​తో సీఎస్కేకు తిరుగులేని విజయాలు అందిస్తున్నాడు.

గురువారం 6 వికెట్ల తేడాతో సన్​రైజర్స్​ హైదరాబాద్​ను ఓడించింది చెన్నై. మొదట బ్యాటింగ్​కు దిగిన హైదరాబాద్.. 7 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. ఛేదనలో చకచకా సాగిపోయిన చెన్నై.. విజయాన్ని అందుకుని ప్లేఆఫ్స్​లో అడుగుపెట్టింది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్​, డుప్లెసిస్​ రాణించారు.

ఇదీ చదవండి:Dhoni CSK: 'చేయాల్సింది ఇంకా చాలా ఉంది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.