MS Dhoni angry: మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీ మరోసారి ఫైర్ అయ్యాడు. ఆదివారం సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలర్‌పై కాస్త చిరాకు పడ్డాడు. విండీస్ వీరుడు, హైదరాబాద్ బ్యాటర్ నికోలస్ పూరన్ బ్యాటింగ్ చేస్తుండగా.. ముకేశ్ చౌదరి బౌలింగ్‌కు వచ్చాడు. ఈ క్రమంలోనే బంతిని లెగ్‌సైడ్ సంధించాడు. అది వైడ్‌గా వెళ్లింది. ఇది చూసి ధోనీ ఆగ్రహం వ్యక్తం చేశాడు! ముకేశ్‌ను చూస్తూ కొన్ని సంజ్ఞలు చేశాడు. తలకు చేతిని పెట్టి 'కాస్త మెదడు ఉపయోగించు' అని అర్థం వచ్చేలా సూచనలు చేశాడు. ముకేశ్ బౌలింగ్ చేసే సమయంలో ధోనీ.. ఆఫ్ సైడ్ ఫీల్డర్లను మోహరించాడు. అలాంటి ఫీల్డింగ్ పెట్టుకొని ముకేశ్ బంతిని లెగ్‌సైడ్ విసిరిన నేపథ్యంలో ధోనీకి కోపం వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఫీల్డర్లను చూపిస్తూ.. ఆఫ్‌సైడ్ బౌలింగ్ చేయమని మహీ సూచించాడు.
200 పరుగులకు పైగా లక్ష్యాన్ని కాపాడుకోవాలంటే బౌలర్లు తమ ఓవర్లలో కనీసం రెండు బంతులైనా సరిగా వేయాలని మ్యాచ్ అనంతరం ధోనీ చెప్పుకొచ్చాడు. 'బౌలర్లను మంచి ప్రదేశంలో బౌలింగ్ చేయమని మాత్రమే సూచించా. ఆరు ఓవర్ల తర్వాత స్పిన్నర్లు చాలా బాగా వేశారు. చివర్లో మా బౌలర్లకు ఒకే విషయం చెప్పా. ఒకే ఓవర్‌లో నాలుగు సిక్సర్లు కొట్టినా.. మిగతా రెండు బంతులకు పరుగులేమీ ఇవ్వకుండా ఉంటే మ్యాచ్‌ను గెలిచినట్లేనని' ధోనీ తెలిపాడు.
ఆదివారం జరిగిన మ్యాచ్‌లో.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై చెన్నై 13 పరుగుల తేడాతో గెలుపొందింది. 203 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో 189 పరుగులకే పరిమితమైంది ఎస్ఆర్హెచ్. ఓపెనర్లు అభిషేక్ శర్మ (39), కేన్ విలియమ్సన్ (47) రాణించినా.. మిడిలార్డర్ విఫలమైంది. నికోలస్ పూరన్ (64*) ఒంటరి పోరాటం చేశాడు. కాగా, చెన్నై బౌలర్లలో ముకేశ్ చౌదరి 4 వికెట్లతో సత్తాచాటాడు. శాంట్నర్, ప్రిటోరియస్ తలో వికెట్ పడగొట్టారు.
ఇదీ చదవండి: IPL 2022: ఆ లెక్క దాటాలంటే లక్ ఉండాలి బాసూ!