చెన్నై సూపర్‌కింగ్స్ మంచి మనసు చాటుకుంది. తమ జట్టులోకి కొత్తగా వచ్చిన ఆల్‌రౌండర్ మొయిన్ అలీ అభ్యర్ధనను మన్నించి, ఆల్కహాల్ బ్రాండ్ జెర్సీని తొలగించింది.
అసలు ఏం జరిగింది?
ఈ సీజన్ కోసం ఇప్పటికే ముంబయిలో ప్రాక్టీసు మొదలుపెట్టింది చెన్నై జట్టు. అయితే జెర్సీపై ఆల్కహాల్ 'ఎస్ఎన్జె 10000' లోగో ఉందని, అది లేకుండా ఉన్న జెర్సీని ఇవ్వాలని అలీ, మేనేజ్మెంట్ను కోరాడు. దీనిపై స్పందించిన సీఎస్కే అతడి అభ్యర్ధనకు అంగీకారం తెలిపింది.
గతంలో ఆర్సీబీ తరఫున అలీ ఆడినప్పుడు కూడా ఆల్కహాల్ బ్రాండ్ లోగోలు లేని జెర్సీనే వేసుకుని మ్యాచ్‌ల్లో పాల్గొన్నాడు.
ధోనీ సారథ్యంలో చెన్నై తరఫున ఆడేందుకు ఎదురుచూస్తున్నానని ఇటీవల అలీ చెప్పాడు. ఏప్రిల్ 10న జరిగే తన తొలి మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది సీఎస్కే.