ETV Bharat / sports

RCB vs PBKS: పంజాబ్​పై ఆర్​సీబీ విజయం.. ప్లేఆఫ్స్​ బెర్తు ఖరారు

author img

By

Published : Oct 3, 2021, 7:19 PM IST

Updated : Oct 3, 2021, 7:46 PM IST

పంజాబ్​ కింగ్స్​పై(RCB vs PBKS) 6 పరుగుల తేడాతో విజయం సాధించింది రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు. దీంతో (IPL 2021) ప్లే ఆఫ్స్​లో బెర్తు ఖరారు చేసుకుంది కోహ్లీసేన.

RCB vs PBKS
Virat Kohli

చివరి ఓవర్‌ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో (IPL 2021) పంజాబ్​ కింగ్స్​పై రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB vs PBKS) జట్టు 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. బెంగళూరు బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడం వల్ల పంజాబ్‌.. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 158 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (57) అర్ధ శతకంతో రాణించినా పంజాబ్‌కు (IPL 2021 Live) ఓటమి తప్పలేదు. కెప్టెన్‌ రాహుల్‌ (39), మార్‌క్రమ్‌ (20) ఫర్వాలేదనిపించారు. షారుక్‌ ఖాన్‌ (16) చివరి ఓవర్లో ఔటయ్యాడు. నికోలస్ పూరన్‌ (3), సర్ఫరాజ్‌ (0) విఫలమయ్యారు. బెంగళూరు బౌలర్లలో యుజువేంద్ర చాహల్‌ మూడు వికెట్లు, షాబాజ్‌ అహ్మద్‌, జార్జ్‌ గార్టన్ తలో వికెట్‌ తీశారు. ఈ విజయంతో ప్లే ఆఫ్స్​ (IPL Play Offs) బెర్తు ఖరారు చేసుకుంది ఆర్​సీబీ.

అంతకు ముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కి దిగిన రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB vs PBKS) నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. గ్లెన్‌ మాక్స్‌వెల్‌ (57) అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. ఓపెనర్లు (RCB vs PBKS Live Score) దేవ్‌దత్‌ పడిక్కల్‌ (40), విరాట్‌ కోహ్లి (25) శుభారంభం చేశారు. డి విలియర్స్‌ (23) ఫర్వాలేదనిపించాడు. షాబాజ్‌ అహ్మద్ (8) ఆకట్టుకోలేకపోయాడు. డేనియల్ క్రిస్టియన్‌ (0), జార్జ్‌ గార్టన్‌ (0) డకౌటయ్యారు. పంజాబ్‌ బౌలర్లలో హెన్రిక్స్‌ మూడు, షమి మూడు వికెట్లు తీశారు.

పంజాబ్​కు కష్టమే..

ఆడిన 13 మ్యాచ్​ల్లో 8 ఓడిపోయిన పంజాబ్​ కింగ్స్​.. ప్లే ఆఫ్స్​ అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది. ఒకవేళ చివరి మ్యాచ్​లో గెలిచినా.. రన్​రేట్​ కీలకమయ్యే అవకాశం ఉంది. అయితే.. రన్​రేట్​ మైనస్​లో ఉన్న పంజాబ్​ ప్లే ఆఫ్​ చేరడమే కష్టమే.

ఇదీ చూడండి: Yuvraj Singh: లైగర్​తో యువీ​ వార్​!.. ఎవరు గెలిచారంటే?

Last Updated : Oct 3, 2021, 7:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.