గురువారం చెన్నైలో జరగనున్న ఐపీఎల్ వేలం నుంచి ఇంగ్లాండ్ క్రికెటర్ మార్క్ వుడ్ తప్పుకున్నాడు. వేలంలో రూ.2 కోట్ల ఆటగాళ్ల జాబితాలో ఉన్న వుడ్.. కుటుంబంతో తగిన సమయం కేటాయించేందుకే ఈ ఏడాది లీగుకు దూరంగా కానున్నాడని తెలుస్తోంది.
బుధవారం చెన్నైలోని జట్టు శిబిరంలోకి మార్క్ వుడ్, వికెట్ కీపర్ జానీ బెయిర్ స్టో చేరారు. టీమ్ఇండియాతో జరగనున్న మిగిలిన రెండు టెస్టుల్లో వీరిద్దరూ ఆడనున్నారు.
ఇదీ చూడండి: ఐపీఎల్-2021 వేలం: ఈ విషయాలు తెలుసుకోండి!