ETV Bharat / sports

'వచ్చే వారంలో క్రికెటర్లకు వాక్సిన్​!'

author img

By

Published : Apr 27, 2021, 12:44 PM IST

ముంబయి ఇండియన్స్​ బ్యాట్స్​మన్​ క్రిస్​ లిన్​ వాక్సినేషన్​పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. వచ్చే వారంలో ఐపీఎల్​ ఆటగాళ్లందరికీ కొవిడ్​ వాక్సిన్​ ఇవ్వనున్నట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు​. అయితే విదేశీ క్రికెటర్లకు వాక్సిన్​ ఎలా ఇస్తారని పలువురు అభిప్రాయపడ్డారు.

Lynn requests Cricket Australia to arrange charter flight post IPL
'వచ్చే వారం క్రికెటర్లందరికీ వాక్సిన్లు!'

ఐపీఎల్​ ఆటగాళ్లందరికీ వచ్చే వారం వాక్సిన్​ ఇవ్వనున్నట్లు ఆస్ట్రేలియా క్రికెటర్​ క్రిస్​ లిన్​ అన్నాడు. మంగళవారం ఓ వెబ్​సైట్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లిన్​ ఈ విషయాన్ని స్పష్టం చేశాడు. అయితే ఈ ప్రకటనను భారత క్రికెట్​ నియంత్రణ మండలి(బీసీసీఐ) కాకుండా ముంబయి ఇండియన్స్​కు చెందిన బ్యాట్స్​మన్ వెల్లడించడం అందర్ని ఆశ్చర్యాన్ని గురిచేస్తోంది. ​

"దేశంలో సంక్షోభం తీవ్రస్థాయిలో ఉందని మాకు తెలుసు. మాకంటే దారుణమైన పరిస్థితిలో చాలామంది ఉన్నారు. కానీ, మా ఆటగాళ్లంతా బయోబబుల్​లో ఉన్నాం. వచ్చే వారం వాక్సిన్లు వేయించుకోనున్నాం. ఓ ప్రైవేట్​ విమానంలో స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం అనుమతిస్తుందని ఆశిస్తున్నా. రిస్క్​ అని తెలిసే టోర్నీ ఆడేందుకు సంతకాలు చేశాం. ఐపీఎల్​ ముగిసిన తర్వాత వీలైనంత త్వరగా ఇంటికి వెళ్తే బాగుంటుంది".

- క్రిస్​ లిన్​, ఆస్ట్రేలియా క్రికెటర్​

అయితే మే 1 నుంచి దేశంలోని 18 ఏళ్లు నిండిన ప్రతిఒక్కరికీ వాక్సిన్లు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. దాని కోసం బుధవారం నుంచి ఆన్​లైన్​ రిజిస్ట్రేషన్​ ప్రారంభం కానుంది. అయితే క్రిస్​ లిన్​ వ్యాఖ్యల ప్రకారం విదేశీయులకూ ఇచ్చే అవకాశం ఉందా? అని పలువురు ఆశ్చర్యానికి గురయ్యారు.

భారత్​ నుంచి విమానాలపై ఆంక్షలు

భారత్​ నుంచి వచ్చే విమానాలపై మే 15 వరకు నిషేధం విధిస్తున్నట్లు ఆస్ట్రేలియా ప్రభుత్వం వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ముగ్గురు ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఐపీఎల్​ నుంచి నిష్క్రమించగా.. వార్నర్​, స్మిత్​ అదే బాట పట్టనున్నారని వార్తలు వస్తున్నాయి.

ఇదీ చూడండి.. ఐపీఎల్​ను వీడేందుకు సిద్ధమైన వార్నర్​, స్మిత్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.