ETV Bharat / sports

'స్మిత్​ కోసం ఎంత దూరమైన వెళ్లేవాళ్లం.. కానీ!'

స్టార్​ క్రికెటర్​ స్టీవ్​స్మిత్​ తక్కువ ధరకే తమ జట్టు సొంతం చేసుకోవడం అదృష్టమని అంటున్నాడు దిల్లీ క్యాపిటల్స్​ సహాయక కోచ్​ మహ్మద్​ కైఫ్​. అయితే దిల్లీ జట్టు స్మిత్​ను ఎంత ధరకైనా కొనేందుకు సిద్ధపడిందని వేలం అనంతరం కైఫ్​ వెల్లడించాడు.

Lucky to have Steve Smith so cheap: DC assistant coach Kaif
'స్మిత్​ కోసం ఎంత దూరమైన వెళ్లేవాళ్లం.. కానీ!'
author img

By

Published : Feb 19, 2021, 7:46 AM IST

ఆస్ట్రేలియా బ్యాట్స్​మన్​ స్టీవ్​స్మిత్​ను అతితక్కువ ధరకే సొంతం చేసుకోవడం తమ అదృష్టమని అంటున్నాడు దిల్లీ క్యాపిటల్స్​ అసిస్టెంట్​ కోచ్​ మహ్మద్​ కైఫ్​. అయితే వేలంలో అతడిని ఎంత ధరకైనా కొనేందుకు తమ యాజమాన్యం సిద్ధపడిందని వేలం అనంతరం మీడియాతో వెల్లడించాడు.

"ఐపీఎల్​ గత సీజన్లో మా టీమ్​లోని కీలక ఆటగాళ్లైన అమిత్​ మిశ్రా, ఇషాంత్​ శర్మ గాయాలతో టోర్నీకి దూరమయ్యారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత సీజన్​కు బ్యాకప్​ కోసం అంతర్జాతీయ క్రికెటర్లను వేలంలో కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నాం. నాకు తెలిసి అతడు (స్మిత్​) అంత తక్కువ దొరకడం మా అదృష్టం".

- మహ్మద్​ కైఫ్​, దిల్లీ క్యాపిటల్స్​ అసిస్టెంట్​ కోచ్​

గతేడాది రాజస్థాన్​ రాయల్స్​ జట్టుకు ఆడిన స్టీవ్​స్మిత్​.. ఆడిన 14 మ్యాచ్​ల్లో 25.91 రన్​రేట్​తో కేవలం 311 పరుగులను చేశాడు. గత సీజన్​లో తన ప్రదర్శనతో యాజమాన్యాన్ని మెప్పించకపోవడం వల్ల.. ప్రస్తుత సీజన్​లో ఆ జట్టు వదులుకుంది. దీంతో రూ.2 కోట్ల కనీస ధరతో ఐపీఎల్​ వేలంలోకి వచ్చిన స్మిత్​ను.. దిల్లీ క్యాపిటల్స్​ జట్టు రూ.2.2 కోట్లకు సొంతం చేసుకుంది. 2018 ఐపీఎల్​ సీజన్​లో స్మిత్​ను అత్యధికంగా రూ.12.5 కోట్లను రిటైన్​ చేసుకుంది.

ఇదీ చూడండి: ఐపీఎల్​ 2021: ఏ జట్టులో ఎవరెవరు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.