ETV Bharat / sports

రెండో మ్యాచ్​కు ముందు ధోనీసేనకు ఎదురుదెబ్బ! - CSK Ngidi and Jason Behrendorff

తమ బౌలర్లు ఎంగిడి, బెహ్రాన్​డార్ఫ్.. రెండో మ్యాచ్​కు అందుబాటులో ఉండరని చెన్నై జట్టు కోచ్ ఫ్లెమింగ్ చెప్పాడు. వారిద్దరూ భారత్​కు రావాల్సి ఉందని పేర్కొన్నాడు.

Losing Hazlewood a blow, Ngidi and Jason also not available for next game: Fleming
ఎంగిడితో ధోనీ
author img

By

Published : Apr 11, 2021, 4:20 PM IST

Updated : Apr 11, 2021, 4:30 PM IST

దిల్లీతో శనివారం జరిగిన మ్యాచ్​లో చెన్నై జట్టు 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. బ్యాటింగ్​లో రైనా, కరన్, రాయుడు ఆకట్టుకున్నప్పటికీ.. బౌలింగ్​లో తేలిపోయింది. అయితే రెండో మ్యాచ్​కు సిద్ధమవుతున్న సీఎస్కేకు మరో దెబ్బ తగిలింది. విదేశీ పేసర్లు ఎంగిడి, బెహ్రాన్​డార్ఫ్.. ఈ పోరులో పాల్గొనలేకపోతున్నారని కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ చెప్పాడు. తమ దేశాల్లో మ్యాచ్​లు ఆడుతున్న వారిద్దరూ, భారత్​ వచ్చి క్వారంటైన్​లో ఉండాల్సి ఉంటుందని.. అందుకే రెండో మ్యాచ్​కు అందుబాటులో ఉండరని కోచ్ తెలిపాడు.

Ngidi-Jason
ఎంగిడి, బెహ్రాన్​డార్ఫ్

తొలి మ్యాచ్​లో తాము బ్యాటింగ్​ బాగా చేసినప్పటికీ, బౌలింగ్ విషయంలో మెరుగుపడాలి అని ఫ్లెమింగ్ అన్నాడు. ఈ విషయంలో ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపాడు. కరోనా కారణంగా తటస్థ వేదికల్లో ఆడుతున్న జట్లన్నీ.. ఆ వాతావరణాన్ని అలవాటు చేసుకునేందుకు కొంచెం సమయం పడుతుందని చెప్పాడు. ముంబయి ఇండియన్స్​ తొలి మ్యాచ్​ ఓడిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశాడు.

తొలి మ్యాచ్​లో త్వరగా వికెట్లు పోగొట్టుకున్నా, తమ బ్యాట్స్​మెన్ భారీ స్కోరు చేయడం సానుకూల సంకేతం అని ఫ్లెమింగ్ అన్నాడు. ఏప్రిల్ 16న జరిగే తర్వాతి మ్యాచ్​లో చెన్నై.. పంజాబ్ కింగ్స్​తో తలపడనుంది.

ఇది చదవండి: ఐపీఎల్: స్లో ఓవర్ రేట్.. ధోనీకి జరిమానా

Last Updated : Apr 11, 2021, 4:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.