వివిధ దేశాల క్రికెట్ బోర్డులకు ఐపీఎల్ విషయమై కీలక సూచన చేశాడు ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్. లీగ్ నిర్వహించే సమయంలో ఎలాంటి సిరీస్‌లు పెట్టుకోవద్దని అన్నాడు. ఐపీఎల్‌ను 'బిగ్గెస్ట్ షో ఇన్ ద టౌన్' అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని అభిప్రాయపడ్డాడు.
-
Cricket boards need to realise that the @IPL is the biggest show in town.
— Kevin Pietersen🦏 (@KP24) April 2, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
DO NOT schedule ANY international games whilst it’s on.
V v v simple!
">Cricket boards need to realise that the @IPL is the biggest show in town.
— Kevin Pietersen🦏 (@KP24) April 2, 2021
DO NOT schedule ANY international games whilst it’s on.
V v v simple!Cricket boards need to realise that the @IPL is the biggest show in town.
— Kevin Pietersen🦏 (@KP24) April 2, 2021
DO NOT schedule ANY international games whilst it’s on.
V v v simple!
జూన్ 2 నుంచి న్యూజిలాండ్‌తో రెండు టెస్టుల సిరీస్ ఇంగ్లాండ్ ఆడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ లేదా జాతీయ జట్టుకు ఆడాలా అనే ఆలోచనలో ఉన్నారు ఇంగ్లీష్ క్రికెటర్లు. ఆ దేశ బోర్డు ఇప్పుటికే దీని గురించి ప్రకటన చేసింది. ఎందులో ఆడాలి అనే విషయమై తాము క్రికెటర్లపై ఒత్తిడి తీసుకురామని ఇంగ్లాండ్ డైరెక్టర్ ఆస్లే గిల్స్ అన్నారు.
ఈ సీజన్లో ఇంగ్లీష్ జట్టుకు చెందిన 14 మంది ఆటగాళ్లు ఐపీఎల్లో ఆడుతున్నారు. మోర్గాన్, బట్లర్, స్టోక్స్, బెయిర్‌స్టో, మొయిన్ అలీ, సామ్ కరన్, టామ్ కరన్, లివింగ్ స్టోన్, డేవిడ్ మలన్ ఇందులో ఉన్నారు.