ETV Bharat / sports

చెన్నైకి కోహ్లీ.. క్రేజీ ట్వీట్ పెట్టిన ఆర్సీబీ! - ఐపీఎల్ న్యూస్

తమ సారథి చెన్నైలో అడుగుపెట్టాడంటూ ఆర్సీబీ ట్వీట్ చేసింది. 'ఇవాళ ఇంటర్నెట్​ను మేం చాలా బ్రేక్ చేశామని మీరు అనుకుంటే మరోసారి ఆలోచించండి. కెప్టెన్ కోహ్లీ వచ్చేశాడు' అని రాసుకొచ్చింది.

Kohli reaches Chennai to join RCB squad
చెన్నైకి కోహ్లీ.. క్రేజీ ట్వీట్ పెట్టిన ఆర్సీబీ!
author img

By

Published : Apr 1, 2021, 3:20 PM IST

రాయల్ ఛాలెంజర్స్​ బెంగళూరు కెప్టెన్ కోహ్లీ.. ఐపీఎల్ కోసం చెన్నై చేరుకున్నాడు. ఈ క్రమంలోనే జట్టు గురువారం ట్వీట్ చేసింది. అలానే ఏడు రోజుల క్వారంటైన్​ తర్వాత విరాట్ జట్టుతో కలవనున్నాడు. ఇటీవల ఇంగ్లాండ్​తో సిరీస్​ అనంతరం బయో బబుల్​ నిబంధనలు అతడు ఉల్లంఘించడమే ఈ క్వారంటైన్​కు కారణం.

ఇప్పటికే చెన్నై చేరుకున్న ఆర్సీబీ బృందం.. మంగళవారం నుంచి ప్రాక్టీసు ప్రారంభించింది. ప్రస్తుతం ఆటగాళ్లందరూ తీవ్రంగా సాధన చేస్తున్నారు. మరో స్టార్ ఆటగాడు ఏబీ డివిలియర్స్​ కూడా గురువారం, జట్టు ఏర్పాటు చేసిన బయో బబుల్​లోకి ప్రవేశించాడు. ఏప్రిల్ 9న మొదలయ్యే లీగ్​లోని తొలి మ్యాచ్​లో బెంగళూరు- ముంబయి జట్లు తలపడనున్నాయి.

ఇది చదవండి: ఆర్సీబీ క్యాంప్​లో డివిలియర్స్.. నెట్స్​లో మలన్ సిక్సులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.