ETV Bharat / sports

టీ20 క్రికెట్​కు రోహిత్​, కోహ్లీ, రాహుల్​ గుడ్​ బై​.. 90 రోజుల్లో జరిగేది ఇదే!

Kohli Rahul Rohit T20 Career : ఐపీఎల్ 2023 సీజన్​లో​ యువ ప్లేయర్లు అదరగొడుతున్నారు. దీంతో సీనియర్​ ఆటగాళ్లు విరాట్​ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్​ టీ20 భవిష్యత్​పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ మేరకు టీమ్​ఇండియా మాజీ దిగ్గజం రవి శాస్త్రి కూడా అభిప్రాయపడ్డారు. మరో మాజీ క్రికెటర్.. రానున్న 90 రోజుల్లో ఈ ప్లేయర్లపై వేటు పడుతుందని టైమ్​లైన్​ ఇచ్చాడు. ఆ వివరాలు..

t20 rohit kohli
t20 rohit kohli
author img

By

Published : May 16, 2023, 8:31 PM IST

​Kohli Rahul Rohit T20 Career : టీ20 క్రికెట్ ఫార్మాట్​ వేగంగా మారుతోంది. మెరుపు షాట్లు, అద్భుతమైన బౌండరీలతో సూపర్​ యాక్షన్​తో ఆటగాళ్లు ఆకట్టుకుంటున్నారు. టీ20 ఫార్మాట్​లో ప్లేయర్​ సామర్థ్యం కొలిచేవి బౌండరీల శాతం, స్ట్రైక్​ రేట్​ గణాంకాలే. అలాంటి ప్లేయర్లను ఐపీఎల్ సమృద్ధిగా అందిస్తోంది. టీమ్​ఇండియాలో ఎంపిక చేయడానికి బీసీసీఐ సెలక్టర్లకు మంచి ఆప్షన్లు ఇస్తోంది. దీంతో ఈ ఫార్మాట్​లో విరాట్​ కోహ్లీ, రోహిత్​ శర్మ, కేఎల్​ రాహుల్​ లాంటి సీనియర్​ స్టార్​ ప్లేయర్ల భవిష్యత్​ ప్రశ్నార్థకమవుతోంది.

ఈ క్రమంలో రానున్న 90 రోజుల్లో ఈ ప్లేయర్లపై వేటు పడుతుందని టైమ్​లైన్​ ఇచ్చాడు టీమ్ఇండియా మాజీ క్రికెటర్​ ఆకాశ్​ చోప్రా. 'టీ20 క్రికెట్​లో అగ్రెసివ్ బ్రాండ్​​గా ఉంటామని గతంలో ఇచ్చిన హామీకి బీసీసీఐ కట్టుబడి ఉంటే.. రోహిత్​, రాహుల్, కోహ్లీకి ఇబ్బందులు ఎదురవుతాయి. అయితే, మొదట వేటు పడేది కోహ్లీ, రోహిత్​ పైనే. తర్వాతి తరం ఆటగాళ్లు సిద్ధమవుతున్నారని నేను భావిస్తున్నాను. అలా కొత్త వాళ్లు వస్తే.. ముందు తరం క్రికెటర్లకు ఇబ్బంది ఎదురవుతుంది. ఇది వన్డే వరల్డ్​ కప్​ జరిగే ఏడాది. అయినా కూడా కొన్ని టీ20 మ్యాచ్​లు జరుగుతాయి. అయితే, జరిగే ఆ కొద్ది మ్యాచ్​ల్లో కూడా విరాట్​ కోహ్లీ, రోహిత్ శర్మ ఆడరనేది నా అభిప్రాయం. ఇక, కేఎల్ రాహుల్​ అప్పటికివరకు అందుబాటులో ఉంటాడనేది అనుమానమే. అందుకే రానున్న 90 రోజుల్లో పరిస్థితులు అనూహ్యంగా మారుతాయి' అని చెప్పుకొచ్చాడు ఆకాశ్​ చోప్రా.

ఇదే విషయంపై టీమ్​ఇండియా మాజీ దిగ్గజం రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్​, కోహ్లీ, కేఎల్​ రాహుల్​లను టీ20 నుంచి తప్పించి.. యువ ప్లేయర్లకు అవకాశం ఇవ్వాలని ఇటీవల బీసీసీఐకి సూచించాడు. సీనియర్​ ప్లేయర్లను వన్డే, టెస్టులకు పరిమితం చేయాలని చెప్పాడు. 'ఈ ఐపీఎల్​ సీజన్​లో రింకూ సింగ్​, యశస్వి జైస్వాల్​, జితేశ్​ శర్మ, తిలక్​ వర్మ లాంటి యంగ్​ ప్లేయర్లు అదరగొడుతున్నారు. దీంతో సెలక్టర్లకు మంచి ఆప్షన్లు లభిస్తున్నాయి. కోహ్లీ, విరాట్ లాంటి ప్లేయర్లు నిరూపించుకున్నాడు. వారి గురంచి అందరికీ తెలుసు. కానీ, ఐపీఎల్​లో మంచి ప్రదర్శన చేసిన వారికి అవకాశాలు రావాలి' అని చెప్పుకొచ్చారు.

రవి శాస్త్రి, ఆకాశ్​ చోప్రా చెప్పిన దాంట్లో కూడా వాస్తవం లేకపోలేదు. ఇప్పటికే అన్ని ఫార్మాట్లలో విరాట్​, రోహిత్​ గ్యాప్​ లేకుండా ఆడుతున్నారు. బిజీ షెడ్యూల్ కారణంగా ఆటగాళ్లలో చికాకు పెరుగుతోందని కాబట్టి.. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌పై కూడా శ్రద్ధ పెట్టాలి. విరాట్ వయసు ప్రస్తుతం 34. రోహిత్ ఏజ్​ 36. ఈ కారణంగా కూడా మూడు ఫార్మాట్లలో వీరు రెగ్యులర్‌గా మ్యాచ్‌లు ఆడటం కష్టమే. అయితే వీరిద్దరిని టీ20ల నుంచి తప్పిస్తే.. వన్డే, టెస్టుల్లో ఆడుతారు. తద్వారా మరికొన్ని రోజులు జట్టులో ఉండే అవకాశం ఉంది. నిజానికి టీమ్​ఇండియా సెలక్టర్లు కూడా ఈ దిశగా అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది. అందులో భాగంగానే హార్దిక్ పాండ్యకు టీ20 పగ్గాలు అప్పగించారు. టీ20 కొత్త ప్లేయర్లు వస్తే.. వచ్చే ఏడాది జరగబోయే టీ20 వరల్డ్​ కప్​లో టీమ్ఇండియా టైటిల్​ గెలిచే అవకాశం ఉంటుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.