ETV Bharat / sports

పృథ్వీ 'షో'.. కోల్​కతాపై దిల్లీ ఘనవిజయం - కోల్‌కతా నైట్ రైడర్స్ స్క్వాడ్ టుడే

అహ్మాదాబాద్​ వేదికగా జరుగుతోన్న మ్యాచ్​లో కోల్​కతా నైట్​రైడర్స్​ జట్టుపై దిల్లీ క్యాపిటల్స్​ ఘన విజయం సాధించింది. 155 పరుగుల లక్ష్యాన్ని 16.3 ఓవర్లలో పంత్​ సేన ఛేదించింది. దీంతో ఐదో విజయాన్ని దిల్లీ తన ఖాతాలో వేసుకుంది.

KKR vs DC 2021
కోల్‌కతా నైట్ రైడర్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్
author img

By

Published : Apr 29, 2021, 10:52 PM IST

కోల్​కతా నైట్​రైడర్స్​తో జరిగిన మ్యాచ్​లో దిల్లీ క్యాపిటల్స్​ ఘనవిజయం సాధించింది. కోల్​కతా నిర్దేశించిన 155 పరుగుల లక్ష్యాన్ని 16.3 ఓవర్లలో దిల్లీ ఛేదించింది. ఓపెనర్లు పృథ్వీ షా(82) మెరుపు ఇన్నింగ్స్​తో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. శిఖర్​ ధావన్​(46), రిషబ్​ పంత్​(16) ఫర్వాలేదనిపించారు. కోల్​కతా పేసర్​ పాట్​ కమిన్స్​ 3 వికెట్లు పడగొట్టాడు.

అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. ఓపెనర్‌ శుభ్‌మన్‌గిల్‌(43; 38 బంతుల్లో 3x4, 1x6), మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ ఆండ్రూ రసెల్‌(45; 27 బంతుల్లో 2x4, 4x6) టాప్‌ స్కోరర్లుగా నిలిచారు. అంతకుముందు ఓపెనర్‌ నితీశ్‌ రాణా(15; 12 బంతుల్లో 1x4, 1x6) ఆదిలోనే విఫలమయ్యాడు. అయితే.. శుభ్‌మన్‌, రాహుల్‌ త్రిపాఠి(19; 17 బంతుల్లో 2x4) రెండో వికెట్‌కు 44 పరుగులు జోడించారు. ఈ క్రమంలోనే ధాటిగా ఆడుతున్న వీరిని స్టోయినిస్‌ దెబ్బతీశాడు. పదో ఓవర్‌లో రాహుల్‌ను ఔట్‌ చేసి దిల్లీకి రెండో బ్రేకిచ్చాడు.

ఆపై లలిత్‌ యాదవ్‌ 11వ ఓవర్‌లో కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌, సునీల్‌ నరైన్‌ను డకౌట్లుగా పెవిలియన్‌ పంపాడు. తర్వాత శుభ్‌మన్‌.. కాసేపటికే దినేశ్‌ కార్తీక్‌(14) సైతం ఔటయ్యారు. అప్పటికి కోల్‌కతా స్కోర్‌ 16.2 ఓవర్లలో 109/6గా నమోదైంది. చివర్లో రసెల్‌, పాట్‌ కమిన్స్‌(11 నాటౌట్‌; 13 బంతుల్లో 1x4) ధాటిగా ఆడి జట్టు స్కోరును 150 దాటించారు. దిల్లీ బౌలర్లలో అక్షర్‌ పటేల్‌, లలిత్‌ యాదవ్‌ చెరో రెండు వికెట్లు తీయగా స్టోయినిస్‌ ఒక వికెట్ పడగొట్టాడు.

ఇదీ చూడండి.. తడబడిన కోల్​కతా.. దిల్లీ లక్ష్యం 155

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.