ETV Bharat / sports

తడబడిన కోల్​కతా.. దిల్లీ లక్ష్యం 155 - ఢిల్లీ క్యాపిటల్స్ స్క్వాడ్ టుడే

అహ్మాదాబాద్​ వేదికగా జరుగుతోన్న మ్యాచ్​లో దిల్లీ బౌలర్ల ధాటికి కోల్​కతా బ్యాట్స్​మెన్​ తడబడ్డారు. టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగిన మోర్గాన్​ సేన నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లను కోల్పోయి 154 పరుగులు సాధించారు. దీంతో దిల్లీ క్యాపిటల్స్​ జట్టు 155 రన్స్​ చేయాల్సిఉంది.

KKR vs DC 2021
కోల్‌కతా నైట్ రైడర్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్
author img

By

Published : Apr 29, 2021, 9:20 PM IST

దిల్లీ క్యాపిటల్స్​తో జరిగిన మ్యాచ్​లో కోల్​కతా బ్యాట్స్​మెన్​ తడబడ్డారు. టాస్​ ఓడి బ్యాటింగ్​ దిగిన కోల్​కతా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది. ఓపెనర్లు శుభ్​మన్​గిల్​(43), నితీశ్​ రానా(15) శుభారంభాన్నిచ్చినా.. తర్వాత బరిలో దిగిన బ్యాట్స్​మెన్​ రాణించలేకపోయారు.

ఆ తర్వాత వచ్చిన రాహుల్​​ త్రిపాఠి(19) ఫర్వాలేదనిపించినా.. మిడిల్​ ఆర్డర్​లో కెప్టెన్​ ఇయాన్​ మోర్గాన్​, సునీల్​ నరైన్​ డకౌట్​ అవ్వడం వల్ల టీమ్​ స్కోరుపై ప్రభావం పడింది. ఆండ్రూ రస్సెల్​(45) చివర్లో వచ్చి విధ్వంసం సృష్టించాడు. దిల్లీ బౌలర్లు అక్షర్​ పటేల్​, లలిత్​యాదవ్​ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. మార్కస్​ స్టోయినిస్​, ఆవేశ్​ ఖాన్​ తలో వికెట్​ సాధించారు.

ఇదీ చూడండి.. 'ధోనీ స్థానానికి అతడే సరైన ఎంపిక'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.