మన దేశాన్ని క్రికెట్‌ను విడదీయడం చాలా కష్టం. ఆ విషయం ఇప్పుడు మరోసారి రుజువైంది. ఈ ఏడాది టాప్ ట్రెండింగ్‌లో ఐపీఎల్, టీ20 ప్రపంచకప్ నిలవడం అందుకు ఉదాహరణ. ఈ క్రమంలోనే కొవిడ్ వ్యాక్సిన్, కొవిన్ పోర్టల్‌ను వెనక్కు నెట్టేశాయి. వీటిని బుధవారం గూగుల్ వెల్లడించింది.
ఈ ఏడాది మన దేశంలో అత్యధికంగా సెర్చ్ చేసిన పదంగా ఐపీఎల్ నిలిచింది. దీని తర్వాతి స్థానాల్లో కొవిన్, ఐసీసీ టీ20 ప్రపంచకప్, యూరో కప్, టోక్యో ఒలింపిక్స్, కొవిడ్ వ్యాక్సిన్ నిలిచాయి. అయితే గతేడాది కూడా ఐపీఎల్ అగ్రస్థానంలో నిలవడం విశేషం.

ఒలింపిక్స్ తొలి వ్యక్తిగత స్వర్ణం సాధించిన నీరజ్ చోప్డా.. వ్యక్తుల జాబితాలో టాప్‌లో నిలిచాడు. ఆ తర్వాత షారుక్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ఉన్నాడు. ఈ జాబితాలో ఎలన్ మస్క్, విక్కీ కౌశల్, షెహనాజ్ గిల్, రాజ్ కుంద్రా, పీవీ సింధు, బజరంగ్ పూనియా తదితరులు ఉన్నారు.
గాడ్జిల్లా vs కాంగ్, ఎటర్నల్స్ సినిమాలు.. ఈ ఏడాది టాప్ ట్రెండింగ్‌లో నిలిచాయి.
ఇవీ చదవండి:
- ఐపీఎల్ రిటెన్షన్ పూర్తి జాబితా వచ్చేసింది.. ఎవరికి అత్యధిక ధరంటే?
- IPL 2022: మెగా వేలంలో ఈ స్టార్ క్రికెటర్లు ఎన్ని రూ.కోట్లు పలుకుతారో?
- Last IPL Mega Auction: ఇదే చివరి ఐపీఎల్ మెగా వేలమా!
- Miss Excel Tiktok: టిక్ టాక్‌లో టిప్స్ చెబుతూ నెలకు రూ.కోటి సంపాదన
- సీక్రెట్ ఫొటోలు, వీడియోలు దాచేందుకు గూగుల్ కొత్త ఫీచర్
- Password: మీ పాస్వర్డ్స్ హ్యాక్ అయ్యాయా? తెలుసుకోండిలా!