సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన ముంబయి ఇండియన్స్(mi vs srh 2021) ప్లే ఆఫ్స్ బెర్తు మాత్రం సంపాదించలేకపోయింది. సన్‌రైజర్స్ ముందు 236 భారీ లక్ష్యాన్ని ఉంచినా కావాల్సిన రన్‌రేట్‌ను సాధించలేక ఇంటిముఖం పట్టింది. అయితే ఈ మ్యాచ్‌లో యువ ఓపెనర్ ఇషాన్ కిషన్(ishan kishan ipl) అదరగొట్టాడు. 32 బంతుల్లోనే 84 పరుగులతో దుమ్మురేపాడు. దీంతో ఇతడిపై ప్రశంసల వర్షం కురిపించారు మాజీలు, అభిమానులు. తాజాగా మ్యాచ్ అనంతరం మాట్లాడిన కిషన్.. టీ20 ప్రపంచకప్‌లో తాను ఓపెనర్ కోటాలో ఎంపికైనట్లు కోహ్లీ(virat kohli news) తెలిపాడని వెల్లడించాడు.
"టీ20 ప్రపంచకప్ కంటే ముందు ఫామ్‌లోకి రావడం సంతోషంగా ఉంది. ఈరోజు పాజిటివ్ దృక్పథంతో బ్యాటింగ్ చేశాం. 250-260 పరుగులు సాధిస్తామని అనుకున్నాం. మాలిక్ బౌలింగ్‌లో కవర్ డ్రైవ్ ఆడా. ఈ షాట్ నాకు చాలా బాగా నచ్చింది. లీగ్‌లో ప్రతి పరిస్థితికి ముందే సిద్ధమై ఉండాలి. అత్యున్నత ఫామ్‌లో ఆడాలి. ఫామ్ కోల్పోయి బాధపడుతున్న సమయంలో బుమ్రా, హార్దిక్ పాండ్యా, పొలార్డ్ నాకు మద్దతుగా నిలిచారు. ప్రస్తుతం తాను నేర్చుకునే దశలో ఉన్నానని.. చేసిన తప్పును మళ్లీ చేయకూడని వారు చెప్పారు. కోహ్లీ భాయ్‌తో మాట్లాడినపుడు నన్ను ఓపెనర్ కోటాలో ఎంపిక చేశారని చెప్పాడు. అందుకోసం సిద్ధంగా ఉండాలన్నాడు."
-ఇషాన్ కిషన్, యువ క్రికెటర్
టీ20 ప్రపంచకప్ కోసం ప్రకటించిన జట్టును చూసిన మాజీలు.. రోహిత్‌తో పాటు రాహుల్ ఓపెనింగ్ చేయాలని సూచించారు. అలాగే కోహ్లీ కూడా హిట్‌మ్యాన్‌తో ఇన్నింగ్స్ ప్రారంభించే వీలుందని అప్పట్లో చెప్పాడు. తాజాగా ఇషాన్(ishan kishan ipl) కూడా ఈ జాబితాలో చేరాడు. దీంతో ఓపెనర్లుగా ఎవరు వస్తారో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.