ETV Bharat / sports

ఐపీఎలా.. మజాకా.. ఇక నుంచి టోర్నీ కోసం ఐసీసీ ప్రత్యేక షెడ్యూల్​!

ఐపీఎల్​కు సంబంధించి బీసీసీఐ ఓ ఆసక్తికర ప్రకటనను విడుదల చేసింది. ఇకపై భవిష్యత్తులో ఐపీఎల్​ కోసం ఐసీసీ క్యాలెండర్​లో ప్రత్యేక షెడ్యూల్​ను కేటాయిస్తున్నట్లు తెలిపింది. టోర్నీలోని మ్యాచ్​ల సంఖ్యను కూడా 94కు పెంచనున్నట్లు పేర్కొంది.

ఐపీఎల్
ఐపీఎల్​
author img

By

Published : Jun 15, 2022, 3:36 PM IST

ఐపీఎల్​ ఎంట్రీతో క్రికెట్​ ప్రపంచంలో లెక్కలే మారిపోయాయి. దాదాపు రెండు నెలలకుపైగా సాగే ఈ మెగా టోర్నీలో భాగమయ్యేందుకు అన్ని దేశాల క్రికెటర్లు ఆసక్తి చూపిస్తారు. ఐసీసీ నిర్వహించే టోర్నీలకు దీటుగా ఐపీఎల్​కు డిమాండ్​ పెరిగింది. అందుకే ఈ ఏడాది మరో రెండు జట్లను ప్రవేశపెట్టి ఫ్యాన్స్​కు డబుల్​ ధమాకా అందించింది బీసీసీఐ. ఈ సీజన్​ సూపర్​హిట్​ కావడం వల్ల మీడియా హక్కులకు కూడా విపరితంగా డిమాండ్​ పెరిగింది. వచ్చే ఐదేళ్లకుగాను మీడియా ప్రసార హక్కులు రూ.48,390 కోట్లకు అమ్ముడుపోయాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు క్రికెట్​ ప్రపంచంలో ఐపీఎల్​ జోష్​ మరింత పెంచేలా కీలక ప్రకటన చేసింది బీసీసీఐ.

స్పెషల్​గా ఐపీఎల్​ కోసం: ఏటా ఐపీఎల్​లో వివిధ దేశాల ఆటగాళ్లు పాల్గొంటున్నా.. ముందుగా ఉన్న షెడ్యూల్స్​ కారణంగా కొంతమంది ఐపీఎల్​ను మిస్​ అవుతున్నారు. దీంతో తమ అభిమాన ప్లేయర్​ జట్టులో లేడని ఫ్యాన్స్​ కూడా కాస్త నిరాశ చెందుతున్నారు. ఇప్పుడు ఆ లోటును కూడా బీసీసీఐ భర్తీ చేసేసింది. ఇకపై కేవలం ఐపీఎల్​ కోసం అన్ని క్రికెట్​ బోర్డులు ప్రత్యేక షెడ్యూల్​ను కేటాయించేలా తీర్మానించింది. దీనికి ఐసీసీ కూడా ఆమోదం తెలపడంతో లైన్​ క్లియరైంది. ఐసీసీ తయారు చేసే తదుపరి క్యాలెండర్​లో ఐపీఎల్​ కోసం రెండున్నర నెలలు కేటాయించనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జైషా ప్రకటించారు. అంతేకాదు.. భవిష్యత్తులో ఐపీఎల్​ మ్యాచ్​ల సంఖ్య 94కు పెంచనున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి : బాక్సింగ్ దిగ్గజానికి కుర్రాడి ఛాలెంజ్​.. 'ఆ 50 మంది చేయలేనిది నేను చేస్తా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.