ఐపీఎల్లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 పరుగుల తేడాతో విజయం సాధించింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో నమోదైన రికార్డులేంటో చూద్దాం.
- చెపాక్ వేదికగా వరుసగా ఐదో మ్యాచ్‌ను ఓడిపోయింది సన్‌రైజర్స్ హైదరాబాద్. ఇంతకుముందు మూడుసార్లు చెన్నై, గత మ్యాచ్‌లో కోల్‌కతా చేతిలో పరాజయం పాలైంది.
- ఐపీఎల్లో కోహ్లీ కెప్టెన్సీలో ఆర్సీబీ కాపాడుకున్న అత్యంత తక్కువ లక్ష్యం ఇదే. బుధవారం సన్‌రైజర్స్‌తో జరగిన మ్యాచ్‌లో 149 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకుంది ఆర్సీబీ. ఇంతకుముందు 2013లో ముంబయితో జరిగిన మ్యాచ్‌లో 156 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకుంది.
- ఆర్సీబీపై అత్యధిక అర్ధశతకాలు సాధించిన బ్యాట్స్‌మెన్‌గా కొనసాగుతున్నాడు డేవిడ్ వార్నర్. ఇతడు కోహ్లీసేనపై 9 హాఫ్ సెంచరీలు చేశాడు. రోహిత్ శర్మ (7), శిఖర్ ధావన్ (6), గౌతమ్ గంభీర్ (6) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
- ఐపీఎల్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మన్ జాబితాలో మూడో స్థానానికి చేరుకున్నాడు డేవిడ్ వార్నర్. ప్రస్తుతం ఇతడి ఖాతాలో 5294 పరుగులు ఉన్నాయి. విరాట్ కోహ్లీ (5944) అగ్రస్థానంలో కొనసాగుతుండగా, రైనా (5422) రెండో స్థానంలో ఉన్నాడు.