ETV Bharat / sports

దిల్లీపై కోల్​కతా విజయం.. ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం - దిల్లీపై కోల్​కతా విజయం

ప్లే ఆఫ్స్ రేసులో ముందుకు వెళ్లింది కోల్​కతా నైట్​రైడర్స్(kolkata knight riders team). దిల్లీ క్యాపిటల్స్​(KKR vs DC 2021)తో జరిగిన మ్యాచ్​లో 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

IPl new
ఐపీఎల్
author img

By

Published : Sep 28, 2021, 7:09 PM IST

ప్లేఆఫ్స్ ఆశల్ని సజీవంగా ఉంచుకుంది కోల్​కతా నైట్​రైడర్స్(kolkata knight riders team). . సీజన్​లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న దిల్లీ క్యాపిటల్స్​కు షాకిచ్చింది. నేడు (సెప్టెంబర్ 28) దిల్లీ(KKR vs DC 2021)తో జరిగిన మ్యాచ్​లో 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది కేకేఆర్. దిల్లీ విధించిన 128 పరుగుల లక్ష్యాన్ని 18.2 ఓవర్లలో ఛేదించింది. మొదట ఓపెనర్ గిల్ 30 పరుగులతో రాణించగా.. నితీశ్ రానా (36*) తనదైన బ్యాటింగ్​తో జట్టుకు విజయాన్ని అందించాడు. సునీల్ నరేన్ చివర్లో 10 బంతుల్లో 21 పరుగులతో మెరిశాడు.

చతికిలపడిన దిల్లీ

ఈ సీజన్​లో బ్యాటింగ్​లో మంచి ప్రదర్శన కనబర్చిన దిల్లీ క్యాపిటల్స్(delhi capitals team)​ బ్యాట్స్​మెన్ ఈ మ్యాచ్​లో తేలిపోయారు. కోల్​కతా బౌలర్లను కాచుకోలేక చేతులెత్తేశారు. పంత్ (39), స్మిత్ (39) రాణించగా, ధావన్ (24) పర్వాలేదనిపించాడు. వీరు మినహా మిగతా వారందరూ రెండంకెల స్కోర్ చేయడంలో విఫలమయ్యారు. శ్రేయస్ (1), హెట్​మెయర్ (4), లలిత్ యాదవ్ (0), అక్షర్ పటేల్ (0) దారుణంగా నిరాశపర్చారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 127 పరుగులకు పరిమితమైంది దిల్లీ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.