ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు చేతులెత్తేసింది. అటు బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ విఫలమయ్యి.. టోర్నీ నుంచి నిష్క్రమించింది. 139 పరుగుల లక్ష్యాన్ని కోల్‌కతా నైట్‌రైడర్స్ 4 వికెట్లు కోల్పోయి ఛేధించింది. కోల్‌కతా ఓపెనర్లు శుభ్‌మన్ గిల్(29), వెంకటేశ్ అయ్యర్(26) రాణించారు. మరోవైపు ఆర్సీబీ బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్, హర్షల్ పటేల్, సిరాజ్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఓపెనర్లు విరాట్ కోహ్లి, దేవ్‌దత్ పడిక్కల్ (21) శుభారంభం చేశారు. వేగంగా ఆడుతున్న క్రమంలో లాకీ ఫెర్గూసన్ వేసిన ఆరో ఓవర్లో బౌలింగ్‌లో పడిక్కల్ బౌల్డయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన శ్రీకర్ భరత్ (9) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. సునీల్ నరైన్ వేసిన పదో ఓవర్లో వెంకటేశ్ అయ్యర్‌కి క్యాచ్ ఇచ్చి పెలిలియన్ చేరాడు. గ్లెన్ మాక్స్‌వెల్ (15)తో కలిసి నిలకడగా ఆడుతున్న కోహ్లి.. సునీల్ నరైన్ 13వ ఓవర్లో బౌల్డయ్యాడు. డి విలియర్స్ (11) కూడా రాణించలేకపోయాడు. నరైన్ వేసిన 15వ ఓవర్లో బౌల్డై పెవిలియన్ చేరాడు. స్వల్ప వ్యవధిలో కీలక వికెట్లు కోల్పోవడంతో బెంగళూరు స్కోరు నెమ్మదించింది. వరుసగా వికెట్లు పడుతున్న నిలకడగా ఆడుతూ పరుగులు చేయడానికి ప్రయత్నించిన మాక్స్‌వెల్ నరైన్ వేసిన 17వ ఓవర్లో సునీల్ నరైన్ వరుసగా కీలక వికెట్లు 17వ ఓవర్లో ఫెర్గూసన్ చేతికి చిక్కాడు. ఆఖర్లో వచ్చిన షాబాజ్ అహ్మద్ (13), డేనియల్ క్రిస్టియన్ (9) ఆకట్టుకోలేకపోయారు. హర్షల్ పటేల్ (8), జార్జ్ గార్టన్ (0) పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.
ఇదీ చూడండి.. RCB Vs KKR: తడబడిన ఆర్సీబీ బ్యాట్స్‌మెన్.. కోల్‌కతా లక్ష్యం 139