ETV Bharat / sports

ఆర్సీబీ x ముంబయి.. టాస్ గెలిచిన డుప్లెసిస్.. రోహిత్ సేన బ్యాటింగ్ - ipl 2023

ఐపీఎల్​లో రసవత్తరమైన మ్యాచ్​కు రంగం సిద్ధమైంది. ముంబయితో తలపడనున్న ఆర్సీబీ.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.

ipl 2023 mi vs rcb toss
ipl 2023 mi vs rcb toss
author img

By

Published : Apr 2, 2023, 7:02 PM IST

Updated : Apr 2, 2023, 9:47 PM IST

ఐపీఎల్​లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబయి ఇండియన్స్​ల తొలి మ్యాచ్​కు రంగం సిద్ధమైంది. టాస్ గెలిచిన బెంగళూరు బౌలింగ్ ఎంచుకుంది. బెంగళూరులో ఈ మ్యాచ్ జరగనుండగా.. చిన్నస్వామి స్టేడియం ఆర్సీబీ అభిమానులతో నిండిపోయింది. కరోనా తర్వాత జరుగుతున్న మ్యాచ్​లు కాగా.. కోహ్లీ టీమ్​ను ఛీర్ చేయడానికి పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ విచ్చేశారు. ఆర్సీబీ, ఆర్సీబీ అంటూ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. గత మూడు సీజన్లుగా మంచి ప్రదర్శన చేస్తున్న బెంగళూరు.. ఈ సారి ఎలాగైనా కప్పు కొట్టాలన్న సంకల్పంతో ఉంది. మరోవైపు, గతేడాది అత్యంత దారుణ ప్రదర్శన చేసిన రోహిత్ సేన నేతృత్వంలోని ముంబయి ఇండియన్స్.. ఈ ఏడాది ఐపీఎల్​ను ఘనంగా ఆరంభించాలని ఆశిస్తోంది.

ముంబయి ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ ఇటీవలి కాలంలో బ్యాటుతో పెద్దగా ఆకట్టుకోవడం లేదు. అతడి ప్రదర్శన జట్టుకు కీలకం కానుంది. రెండు జట్లను గాయాలు వేధిస్తున్నాయి. గాయాల కారణంగా హెజిల్​వుడ్, పాటీదార్, శ్రీలంక జట్టులో ఆడుతున్న హసరంగ వంటి ప్లేయర్స్ ఆర్సీబీకి దూరంగా ఉన్నారు. ముంబయికి కీలకమైన బుమ్రా గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. జై రిచర్డ్​సన్ సైతం టీమ్​కు దూరమయ్యాడు.

రోహిత్ రికార్డు
రోహిత్ శర్మ సారథిగా 200వ టీ20 మ్యాచ్​లు ఆడనున్నాడు. టీ20ల్లో కెప్టెన్​గా ఈ ఘనత సాధించిన మూడో ఆటగాడిగా రోహిత్ రికార్డుకెక్కాడు. అంతకుముందు ఎంఎస్ ధోనీ ఈ రికార్డు సాధించగా.. వెస్టిండీస్ వీరుడు డారెన్ సామి ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. ధోనీ ఏకంగా 307 టీ20లకు సారథ్యం వహించాడు. డారెన్ సామి 208 మ్యాచ్​లకు కెప్టెన్​గా పనిచేశాడు. ఈ సీజన్​లో అన్ని మ్యాచ్​లు ఆడితే రోహిత్.. డారెన్ సామి రికార్డును అధిగమించి రెండో స్థానానికి చేరుకునే అవకాశం ఉంది. మరోవైపు, 150కి పైగా టీ20లకు సారథ్యం వహించిన ఆటగాళ్లలో రోహిత్ శర్మ గెలుపు శాతం అత్యధికంగా 62.31 శాతంగా ఉంది.

జట్లు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), గ్లెన్ మాక్స్‌వెల్, మైఖేల్ బ్రేస్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేశ్ కార్తీక్ (కీపర్), కరణ్ శర్మ, హర్షల్ పటేల్, ఆకాశ్ దీప్, రీస్ టాప్లీ, మహ్మద్ సిరాజ్
ముంబయి ఇండియన్స్: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (కీపర్), సూర్యకుమార్ యాదవ్, కామెరూన్ గ్రీన్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, నెహాల్ వధేరా, హృతిక్ షోకీన్, పీయూష్ చావ్లా, జోఫ్రా ఆర్చర్, అర్షద్ ఖాన్

సబ్​స్టిట్యూట్​లు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: అనుజ్ రావత్, సుయాశ్ ప్రభుదేసాయి, మహిపాల్ లామ్రోర్, సోనూ యాదవ్, డేవిడ్ విల్లీ.
ముంబయి ఇండియన్స్: జేసన్ బెహ్రెన్‌డార్ఫ్, విష్ణు వినోద్, షామ్స్ ములానీ, సందీప్ వారియర్, రమణదీప్ సింగ్.

Last Updated : Apr 2, 2023, 9:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.