ఐపీఎల్-2023 సీజన్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో లఖ్‌నవూ పేసర్ మార్క్ వుడ్ అదిరిపోయే ప్రదర్శన చేశాడు. నిప్పులు చెరిగే బంతులతో ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. తాజా సీజన్‌లో ఇప్పటివరకు మూడు మ్యాచులు ఆడిన అతడు 9 వికెట్లు తీశాడు. అయితే ఆర్సీబీతో జరిగిన మ్యచ్‌లో ఓ ఓవర్‌లో ఏకంగా రాకెట్ స్పీడ్‌తో బౌలింగ్ వేశాడు. బెంగళూరు ఇన్నింగ్స్ 16వ ఓవర్‌లో మార్క్‌వుడ్.. తాను వేసిన 7 బంతులు(వైడ్‌తో పాటు)ను 150 కిలోమీటర్ల వేగాంతో సంధించి షాక్‌కు గురి చేశాడు.
అతడు ఫస్ట్ బాల్‌ను 150కి.మి వేగంతో సంధించాడు. కానీ అది వైడ్ బాల్. ఆ తర్వాత బంతులను 153, 151, 150, 150, 151.7, 150కి.మిల వేగంతో వేసి ప్రత్యర్థి బ్యాట్లర్లను బెంబేలెత్తించాడు. ఇకపోతే అతడు తొలి ఓవర్‌లో 14 పరుగులు, రెండో ఓవర్‌లో 5 రన్స్, మూడో ఓవర్‌లో 9 పరుగులు, నాలుగో ఓవర్‌లో 9 రన్స్ సమర్పించుకున్నాడు. నాలుగో ఓవర్‌లో మ్యాక్స్‌వెల్‌ను క్లీన్ బౌల్డ్ చేసి ఓ వికెట్ తీశాడు. కాగా, ఓవర్‌లో ప్రతి బంతిని ఈ రేంజ్ స్పీడ్‌లో వేయడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. ఈ మధ్య కాలంతో గత మ్యాచుల్లోనూ ఇలానే నిప్పులు చెరిగే బౌలింగ్ చేస్తున్నాడు.
లాంగెస్ట్ సిక్సర్.. ఈ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ ఓ భారీ సిక్సర్ బాదాడు. దాదాపు 115 మీటర్ల భారీ సిక్సర్‌ను కొట్టాడు. ఈ సిక్స్ ఏకంగా మైదానం బయటకు దూసుకెళ్లింది. ఇది చూసిన స్టేడియంలోని అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. బిష్ణోయ్ వేసిన ఇన్నింగ్స్ 15వ ఓవర్ నాలుగో బాల్‌ను.. డుప్లెసిస్ ఈ మాన్‌స్టర్ సిక్సర్‌ను బాదాడు. ఐపీఎల్-2023 సీజన్‌లో ఇదే అత్యంత భారీ సిక్సర్. మొత్తంగా ఐపీఎల్ హిస్టరీలో ఇది 10వ భారీ సిక్సర్‌గా నిలిచింది. ఐపీఎల్ అరంగేట్రం సీజన్(2008) సమయంలో సీఎస్కే ప్లేయర్ ఆల్బీ మోర్కెల్(125 మీటర్లు), 2013లో పంజాబ్ ప్లేయర్ ప్రవీణ్ కుమార్(124 మీటర్లు), 2011లో గిల్‌క్రిస్ట్(122 మీటర్లు), 2010లో ఉతప్ప(120 మీటర్లు), 2013 గేల్(119), 2009లో యువరాజ్ సింగ్(119), 2008లో రాస్ టేలర్(119), 2016లో బెన్ కట్టింగ్(117 మీటర్లు), 2013లో గంభీర్(117 మీటర్లు) సిక్సర్ బాదారు.
ఇకపోతే ఈ థ్రిల్లర్ మ్యాచ్‌లో పూరన్ (62; 19 బంతుల్లో 4×4, 7×6), స్టాయినిస్ (65; 30 బంతుల్లో 6×4, 5×6), బదోని (30; 24 బంతుల్లో 4×4) చెలరేగడంతో ఒక్క వికెట్ తేడాతో బెంగళూరుపై లఖ్‌నవూ గెలిచింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. బెంగళూరు బౌలర్లలో సిరాజ్, పర్నెల్ తలో మూడు వికెట్లు తీశారు. హర్షల్ పటేల్ 2, కర్ణ్ ఒక వికెట్ పడగొట్టాడు. అంతకుముందు ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో కోహ్లి(61) డుప్లెసిస్, మ్యాక్స్‌వెల్ కూడా దంచేశారు.
-
𝗖𝗼𝗺𝗺𝗮𝗻𝗱𝗲𝗿-𝗶𝗻-𝗖𝗵𝗶𝗲𝗳 becomes 𝗪𝗿𝗲𝗰𝗸𝗲𝗿-𝗶𝗻-𝗖𝗵𝗶𝗲𝗳 🔥#RCBvLSG #TATAIPL #IPL2023 pic.twitter.com/KK5ZqpUmNl
— JioCinema (@JioCinema) April 10, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">𝗖𝗼𝗺𝗺𝗮𝗻𝗱𝗲𝗿-𝗶𝗻-𝗖𝗵𝗶𝗲𝗳 becomes 𝗪𝗿𝗲𝗰𝗸𝗲𝗿-𝗶𝗻-𝗖𝗵𝗶𝗲𝗳 🔥#RCBvLSG #TATAIPL #IPL2023 pic.twitter.com/KK5ZqpUmNl
— JioCinema (@JioCinema) April 10, 2023𝗖𝗼𝗺𝗺𝗮𝗻𝗱𝗲𝗿-𝗶𝗻-𝗖𝗵𝗶𝗲𝗳 becomes 𝗪𝗿𝗲𝗰𝗸𝗲𝗿-𝗶𝗻-𝗖𝗵𝗶𝗲𝗳 🔥#RCBvLSG #TATAIPL #IPL2023 pic.twitter.com/KK5ZqpUmNl
— JioCinema (@JioCinema) April 10, 2023
ఇదీ చూడండి: IPL 2023: ఉత్కంఠ మ్యాచ్‌లో ఆర్సీబీపై లఖ్‌నవూ విజయం.. పూరన్, స్టాయినిస్ విధ్వంసం