క్రికెట్ ప్రపంచానికి ఎంతో మంది యువ ఆటగాళ్లను పరిచయం చేసింది ఇండియన్ ప్రీమియర్ లీగ్. తాజాగా ఈ క్యాష్ రిచ్ లీగ్ నుంచి మరో యువ సంచలనం పుట్టుకొచ్చాడు! అతడే రాజస్థాన్ రాయల్స్ జట్టుకు చెందిన ధ్రువ్ జురెల్. ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ జట్టు ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన ధ్రువ్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కళ్లు చెదిరే షాట్లతో అలరించాడు.
అయితే ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ జట్టు.. ఓటమిపాలైనప్పటికీ ధ్రువ్ మాత్రం.. అందరి మనసులు గెలుచుకున్నాడు. పంజాబ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 15 బంతులు ఆడిన ధ్రువ్ జురెల్.. మూడు ఫోర్లు, రెండు సిక్స్‌లు బాదాడు. 32 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. ముఖ్యంగా పంజాబ్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ వేసిన 19వ ఓవర్లో ధ్రువ్ షాట్లు వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ఐపీఎల్ అరంగేట్ర మ్యాచ్‌లోనే సూపర్ ఇన్నింగ్స్ ఆడిన ఈ ప్లేయర్‌పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తున్నాయి.
-
*Dhruv jurel* 🔥🏏#DhruvJurel @dhruvjurel21 #RRvPBKS
— RR True Fans 💗 🔥 🏏 Royal Family 👑 (@MeenaRamkishan0) April 6, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Best Shot By A Debutant IPL Players So Far...😍 pic.twitter.com/i1BstP4PCY
">*Dhruv jurel* 🔥🏏#DhruvJurel @dhruvjurel21 #RRvPBKS
— RR True Fans 💗 🔥 🏏 Royal Family 👑 (@MeenaRamkishan0) April 6, 2023
Best Shot By A Debutant IPL Players So Far...😍 pic.twitter.com/i1BstP4PCY*Dhruv jurel* 🔥🏏#DhruvJurel @dhruvjurel21 #RRvPBKS
— RR True Fans 💗 🔥 🏏 Royal Family 👑 (@MeenaRamkishan0) April 6, 2023
Best Shot By A Debutant IPL Players So Far...😍 pic.twitter.com/i1BstP4PCY
ఎవరీ ధ్రువ్ జురెల్?
22 ఏళ్ల ధ్రువ్ జురెల్.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రాలో జన్మించాడు. దేశవాళీ క్రికెట్‌లో ధ్రువ్ ఉత్తర్‌ప్రదేశ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. 2020 అండర్-19 ప్రపంచకప్‌లో భారత జట్టుకు వైస్ కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. ఈ టోర్నీలో మూడు మ్యాచ్‌లు ఆడిన ధ్రువ్ జురెల్ 89 పరుగులు సాధించాడు. తన ఫస్ట్‌క్లాస్ కెరీర్‌లో 11 మ్యాచ్‌లు ఆడిన అతడు 587 పరుగులు సాధిచాడు. 2022-23 రంజీ సీజన్‌లో నాగాలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో జురెల్ అద్భుతమైన డబుల్ సెంచరీతో చెలరేగాడు. ఓపెనర్‌గా వచ్చిన అతడు 329 బంతులు ఎదుర్కొని 249 పరుగులు చేశాడు.
టీ20ల విషయానికి వస్తే.. ఇప్పటివరకు 4 టీ20లు మాత్రమే ఆడాడు ధ్రువ్. 89 పరుగులు చేశాడు. ఐపీఎల్ 2022 మెగా వేలంలో రూ.20 లక్షల కనీస ధరకు రాజస్థాన్ రాయల్స్ ధ్రువ్ జురెల్‌ను కొనుగోలు చేసింది. కానీ ఆ సీజన్‌లో మాత్రం అతడు బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఈ ఏడాది సీజన్‌లో తనకు వచ్చిన అవకాశాన్ని మాత్రం అతడు సద్వినియోగం చేసుకున్నాడు.
బుధవారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమిపాలైంది. పంజాబ్ నిర్దేశించిన 198 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 192 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. రాజస్థాన్ ఓపెనర్లు యశస్వి(11), రవిచంద్రన్ అశ్విన్ విఫలమయ్యారు. ఆ తర్వాత వచ్చిన జోస్ బట్లర్(19) దూకుడుగా ఆడేందుకు యత్నంచి ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన సంజూ శాంసన్(42).. జట్టు స్కోరు బోర్డును పరిగెత్తించాడు. కానీ నాథన్ బౌలింగ్‌లో క్యాచ్ ఔటయ్యాడు. హెట్మెయర్ 36, ధ్రువ్ జురెల్ 32 పరుగులు చేసి పోరాడినా రాజస్థాన్‌కు ఓటమి తప్పలేదు. పంజాబ్ బౌలర్ నాథన్ ఎల్లిస్ 4 వికెట్లు తీసి రాజస్థాన్ జట్టు పతనాన్ని శాసించాడు.