ETV Bharat / sports

IPL 2023: పదేళ్ల నుంచి ముంబయిది ఇదే కథ.. ఈ సారి ఆ మ్యాజిక్ రిపీట్​ చేస్తుందా?

ఐపీఎల్ 2023లో భాగంగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్​లో తమ తొలి మ్యాచ్​లో ముంబయి ఇండియన్స్​ ఓడిపోయింది. అయితే ఇలా తమ తొలి మ్యాచుల్లో ముంబయి ఓడిపోవడం కొత్తేమి కాదు. వరుసగా పదేళ్ల నుంచి ఇదే చేస్తోంది. అయితే ఇలా ఓడిపోయినప్పటికీ ముంబయి ఓ మ్యాజిక్​ను రిపీట్ చేస్తోంది! ఆ వివరాలు..

Mumbai indians
IPL 2023: పదేళ్ల నుంచి ముంబయిది ఇదే కథ.. ఈ సారి ఆ మ్యాజిక్ రిపీట్​ చేస్తుందా?
author img

By

Published : Apr 3, 2023, 12:01 PM IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్.. ఈ పేరు చెప్పగానే క్రికెట్ అభిమానుల్లో పూనకాలు వస్తాయి. అయితే ఈ మెగాటోర్నీలో ముంబయి ఇండియన్స్​కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ టీమ్​కు సాధ్యం కాని రీతిలో ఏకంగా ఐదు సార్లు ట్రోఫీని ముద్దాడి బలమైన జట్టుగా అవతరించింది. కానీ గత సీజన్​లో మాత్రం పూర్తిగా విఫలమై పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది. అయితే ప్రస్తుతం ఆసక్తిగా సాగుతున్న తాజా సీజన్​లోనూ మార్చి 2న రాయల్ ఛాలెంజర్స్​ బెంగళూరుతో జరిగిన మ్యాచ్​లో ఓడి.. ఓటమితో సీజన్​ను ఆరంభించింది. ముంబయి జట్టులో హైదారాబాద్​ కుర్రాడు తిలక్​ వర్మ మినహా ఎవరూ రాణించలేకపోయారు.

అయితే ఐపీఎల్​లో ఆడిన తమ తొలి మ్యాచ్​లో ఓడిపోవడం ముంబయి ఇండియన్స్​ జట్టుకు కొత్తేం కాదు. గత పదేళ్లుగా ఆ జట్టుకు ఇలా ఫస్ట్​ మ్యాచులో ఓడిపోపడం అలవాటుగా మారిపోయింది. 2013 నుంచి ఆ టీమ్​.. ఐపీఎల్​లో ఆడిన తమ తొలి మ్యాచ్​ను గెలవలేదు. ఓటమితోనే సీజన్లను ఆరంభించింది. అభిమానులు కూడా.. తొలి మ్యాచ్​ను దేవుడికి ఇచ్చేయడం అలవాటే అంటూ సోషల్​మీడియాలో ట్రోల్​ కూడా చేస్తుంటారు.

2013లో ముంబయి ఇండియన్స్​.. బెంగళూరు వేదికగా రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరుతో జరిగిన మ్యాచ్​లో రెండు పరుగుల తేడాతో ఓటమిని అందుకుంది. కానీ ఆ సీజన్​ ముంబయి.. తమ తొలి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. 2014, 2015లో మళ్లీ సేమ్​ సీన్​ రిపీట్​ అయింది. ఆ రెండు సీజన్​లోనూ కోల్​కతా నైట్​ రైడర్స్​తో ఆడిన ముంబయి... రెండు సార్లు ఓడిపోయింది. అయితే 2015లో మాత్రం టైటిల్​ను దక్కించుకుంది.

2016, 17లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్​తో ఆడిన ఫస్ట్​ మ్యాచ్​లో ముంబయి ఇండియన్స్​ తొమ్మిది, ఏడు వికెట్ల తేడాతో ఓటమిని ఖాతాలో వేసుకుంది. అయితే 2017​ సీజన్​ ఛాంపియన్​గా నిలిచింది. 2018లో చెన్నై సూపర్ కింగ్స్​తో జరిగిన మ్యాచ్​లోనూ ఒక్క వికెట్​ తేడాతో ఓడిపోయింది. 2019లో దిల్లీ క్యాపిటల్స్​పై 37 పరుగుల తేడాతో పరాజయాన్ని అందుకుంది. అయితే 2019లో ముంబయినే సీజన్​ విజేత.

ఇక 2020లో చెన్నై సూపర్ కింగ్స్​తో జరిగిన మ్యాచ్​లో ఐదు వికెట్ల తేడాతో ఓడిన రోహిత్ సేన.. ఆ సీజన్​లో టైటిల్​ విన్నర్​గా నిలిచింది. 2021లో చెన్నై వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్​లో రెండు వికెట్ల తేడాతో ఓడింది. ఇక 2022 సీజన్​లో ముంబయి.. తన తొలి మ్యాచ్​లో ఓటమిని మూటగట్టుకుంది. సీజన్​ మొత్తం చెత్త ప్రదర్శన చేసింది. ఇక తాజాగా చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్​లో ముంబయి అదే ఫలితాన్ని రిపీట్​ చేసింది.

2013కు ముందు.. ముంబయి.. 2013కు ముందు 2009, 2010, 2011, 2012 సీజన్లలో తాము ఆడిన ఫస్ట్ మ్యాచుల్లో విజయం సాధించింది. కానీ ఆ సీజన్లలో ముంబయి ట్రోఫీని అందుకోలేకపోయింది. మరి వరుసగా పదేళ్ల పాటు తమ ఐపీఎల్​ ఫస్ట్​ మ్యాచ్​లో ఓటమిని అందుకుంటున్న ముంబయి.. ఈ సీజన్​లో 2013, 2015, 2017, 2019, 2020 మ్యాజిక్​ను రిపీట్​ చేసి.. సీజన్​ విన్నర్​గా నిలుస్తుందో లేదో చూడాలి...

ఇదీ చూడండి: IPL 2023: దినేశ్ కార్తీక్-సిరాజ్.. ఒకరేమో ప్రపంచ రికార్డు.. మరొకరేమో..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.